31.2 C
Hyderabad
April 19, 2024 05: 27 AM
Slider మహబూబ్ నగర్

ఘనంగా బిపి మండల్ 102 వ జయంతి వేడుకలు

#KollapurBPMandal

కొల్లాపూర్ బహుజన జాక్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పితామహులు, మాజీ ముఖ్యమంత్రి బిపి మండల్ 102వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ చౌరస్తా లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

దేశంలో 70 కోట్ల జనాభా ఉన్న బీసీలకు సమగ్ర గుర్తింపు నిచ్చి, విద్యా ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించిన బిపి మండల్ జయంతిని సామాజిక న్యాయ దినోత్సవంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బహుజనులు ఎక్కడ ఉన్న ఘనంగా నిర్వహించుకోవడం అవసరం ఎంతైనా ఉందని బహుజన జాక్  చైర్మన్ మేకల రాముడు యాదవ్, కన్వీనర్ బచ్చలకూర బాల్రాజ్ అన్నారు.

బిపి మండల్ సిఫార్సుల్లో అమలు కాని మిగతా 39 ప్రతిపాదనలు వెంటనే అమలు పరచాలని లేనిపక్షంలో మరో మండల్ సామాజిక యుద్ధం తప్పదని వారు హెచ్చరించారు.

రాజకీయ రిజర్వేషన్లు కావాలి

వెంటనే బీసీల జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్ లను విద్య ఉద్యోగ ముఖ్యంగా రాజకీయ రంగాలలో అమలు పరచాలని, వెంటనే బిసిలకు క్రిమిలేయర్ తొలగించి , ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కచ్చితంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు.

బహుజన జాక్ ముఖ్య సలహాదారులు పసుల సత్యనారాయణ యాదవ్  మాట్లాడుతూ బిపి మండల్ కు వెంటనే భారతరత్న ప్రకటించి, ఆయన జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. యాదవ జాగృతి కన్వీనర్ మేకల మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ బిపి మండల్ ఆజన్మాంతం నీతి నిజాయితీ స్వచ్ఛ పాలన, సామాజిక హక్కుల కోసం యుద్ధం చేసిన మహనీయుడు అని కొనియాడారు.

డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకులు ఇటిక్యాల రామ రాజు యాదవ్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగాలలో రోజురోజుకు రిజర్వేషన్లు కుంచించుకుపోవడం చాలా బాధాకరమని, దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో OBC కోటా లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, యాదవ జాగృతి సేన ముఖ్య నాయకుడు  విజయ్ యాదవ్ , గొల్ల కుర్మా నవ నిర్మాణ సమితి కొల్లాపూర్ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ మాట్లాడుతూ  దేశంలో సగం పైగా జనాభా ఉండి దేశం మొత్తానికి సేవ చేస్తున్న జాతి బి సి జాతి అని , వెంటనే మండల్ 39 ప్రతిపాదనలు అమలు పరచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బరిగెల రాముడు యాదవ్ , యాదవ జాగృతి సేన కోశాధికారి చటమోని  విష్ణుమూర్తి యాదవ్, మండల టిడిపి అధ్యక్షులు ఉడుత రామస్వామి యాదవ్ అఖిల భారత యాదవ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల సాయిలు యాదవ్, బీఎస్పీ నాయకులు మునిస్వామి మాట్లాడుతూ బహుజనులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

కొల్లాపూర్ మండల యాదవ జాగృతి సేన అధ్యక్షుడు మేకల భాస్కర్ యాదవ్, మాసన్న యాదవ్, రాంపురం కురుమయ్య యాదవ్ తదితర బహుజన నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నాం

Satyam NEWS

ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన వాలంటీర్

Satyam NEWS

రావమ్మా…!!

Satyam NEWS

Leave a Comment