37.2 C
Hyderabad
March 29, 2024 19: 07 PM
Slider తూర్పుగోదావరి

రామేశ్వరం గ్రామంలో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

#brahmakamalam

పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బ్రహ్మ కమలం చూసేందుకు హిమాలయాలకు వెళ్లాల్సిన శ్రమ లేకుండా తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో శివ భక్తుని కుటుంబం భక్తులకు బ్రహ్మ కమలం దర్శనం కల్పించారు.

ఆదివారం రాత్రి వికసించి భక్తులను పారవశ్యంలో ముంచెత్తింది గ్రామానికి చెందిన ముమ్మిడి చాందిని, రవి దంపతుల ఇంట్లో బ్రహ్మ కమలం పువ్వు విరబూసింది. ఈ నేపథ్యంలో రాత్రి ప్రత్యేక పూజలు చేశారు పూజలకు గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్న బాబు ఆదిలక్ష్మి దంపతులు, వై ఎస్ ఆర్ సి పి యువనేత వార్డ్ మెంబర్ కొటికలపూడి గణేష్ తదితరులు హాజరయ్యారు

ఈ సందర్భంగా చాందిని రవి దంపతులు మాట్లాడుతూ తమ ఇంటి పెరట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గత 8 నెలల క్రితం నాటి ప్రత్యేక శ్రద్ధతో ఒక కుండీలో విస్తరింపజేశారని అన్నారు. తమకు మొక్కల పెంపకం అంటే మక్కువ అన్నారు. సంవత్సరంలో ఒకే రోజు కొద్ది గంటల సేపు వికసించి ఉండి  అనంతరం ముడుచుకుపోయే ఈ అరుదైన పుష్పం తమ ఇంట పూయడంతో స్థానికులకు నయనానందం ఇచ్చిందన్నారు.

ఈ మొక్కను తమ సొంత బిడ్డలా పెంచామని దీంతో ఈ మొక్క తమ జీవితంలో ఒక భాగంగా మారి పోయిందన్నారు కేవలం హిమాలయాలకు సొంతమైన ఈ బ్రహ్మకమలం మొక్క ఇక్కడ  సాక్షాత్కరించడం తాము చేసుకున్న పుణ్యంగా  స్థానికులు భావిస్తున్నారు. బ్రహ్మ కమలం మొక్క ఆకు నుంచి పువ్వులు పూయడం చక్కటి సువాసన వెదజల్లడం , చల్లటి ప్రదేశాల్లో వికసించడం  దీని ప్రత్యేకత.

Related posts

ముడో దశ కరోనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Satyam NEWS

హైదరాబాద్ మునగడానికి కారణాలు తెలియవా?

Satyam NEWS

రికార్డు స్థాయిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు

Satyam NEWS

Leave a Comment