28.2 C
Hyderabad
April 20, 2024 12: 42 PM
Slider ఆధ్యాత్మికం

దాదీ గుల్జార్ జీవితం మానవ సేవకే అంకితం

#brahmakumaries

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్‌ మాజీ అధ్యక్షురాలు, రాజయోగిని దాదీ హృదయ మోహిని (దాదీ గుల్జార్)  రెండో వర్ధంతి సందర్భంగా కూకట్ పల్లిలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అడ్వైజర్ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదీ గుల్జార్ కు నివాళి అర్పించారు. బ్రహ్మ కుమారీస్ సంస్థ అధ్యక్షరాలిగా దాదీ గుల్జార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఆమె ప్రజలను ఆధ్యాత్మిక మార్గంవైపునకు నడిపించారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆధ్యాత్మికత, సాత్విక జీవనశైలి, రాజయోగ జ్ఞానాన్ని పెంపొందించడానికి దాదీ గుల్జార్ చేసిన కృషిని వడ్డేపల్లి ప్రశంసించారు. రాజయోగిని దాదీ గుల్జార్ జీవితాంతం మానవ సేవకే పాటుపడ్డారని గుర్తు చేశారు. అనంతరం బ్రహ్మ కుమారీస్ చేపడుతున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

బ్రహ్మ కుమారీలు తమ కార్యక్రమాలతో మనుషుల బాధలకు ఉపశమనం కలిగించడంతోపాటు సామాజిక సాధికారత కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. ఇక ముందు కూడా వారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దైవ చింతన కలిగించాలని ఆకాంక్షించారు. అనంతరం బ్రహ్మ కుమారీస్ వడ్డేపల్లిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజు యోగి, బ్రహ్మ కుమార్, రామ్ నాథ్ భాజీ, బ్రహ్మ కుమారీలు గోవింద్, జ్యోతి, శైలజ, సురభి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ‌గన‌యానానికి సిద్ధ‌మైన పీఎస్ఎల్వీ-సీ49

Sub Editor

కర్ణాటకలో కాంగ్రెస్​కు 130పైగా సీట్లు ఖాయం

Bhavani

పెద్దకొత్తపల్లిలో ఈ నెల 20న యాదవుల సదర్ పండుగ

Satyam NEWS

Leave a Comment