39.2 C
Hyderabad
April 25, 2024 17: 35 PM
Slider ఆధ్యాత్మికం

మోహిని అలంకారం లో ఒంటిమిట్ట కోదండ రాముడు

#ontimitta

కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం 8 గంట‌ల‌ నుండి మోహినీ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది.

దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నాడు.

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ వెంక‌టేశ‌య్య‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

అంబరాన్నంటిన “అట్లాంటా-నెల్లూరు” సాంస్కృతిక సంబరాలు

Satyam NEWS

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: వసంత నాగేశ్వరరావు

Satyam NEWS

కాన్ఫిడెన్స్: దేశమంతా ఎంఐఎం గాలి వీస్తోంది

Satyam NEWS

Leave a Comment