మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథోత్సవము రమణీయంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముందుగా రథాంగా పూజ రథాంగ హోమం రథాంగ బలి నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథం పైన అధిరోహింపచేసి అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ దేవస్థానం ఈవో శ్రీనివాస రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది