25.7 C
Hyderabad
June 22, 2024 06: 21 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఎల్లోమీడియాకు బ్రెయిన్ ఫీవర్

ap secratariat

కులాభిమానం ఉండవచ్చు.. అది ఎంతవరకూ ఉండాలో అంత వరకూ ఉండాలి. ఈ రాష్ట్రం మా సొత్తు …. నా కులానికి చెందిన వారే పరిపాలించాలి .. మావాళ్లే బాగుపడాలి .మా కులం  బాబు అయితే నే పాలు లాంటి పాలన ఇవ్వగలడు ..ఇతరులకు పాలన చేత కాదు  అనేటటువంటి మూర్ఖపు ఆలోచనలతో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలలో లేనిపోని అనుమానాలను రేకెత్తించి ఆనందపడాలనే వికృత చేష్టలకు కొంతమంది పాల్పడుతున్నారు.

పచ్చమీడియా గా పేరొంది కోట్లకు పడగలెత్తిన కొంతమంది కుహనా పత్రికా  యజమానులు అవాకులు చెవాకులు వండి వార్చి పేపర్లో రాస్తే, వాటికి తానా తందానా అని బాకా ఊదే మరికొంత మంది జర్నలిస్ట్ సంఘాలు పేరుతో ఒకే కులం వారికి మాత్రమే మేలు జరగాలనే దుర్బుద్ధితో వాటిని సామాజిక మీడియాద్వా రా ప్రచారం చేసి ప్రభుత్వం ఫై ప్రజలలో అనుమానం రేకెత్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కొత్త ప్రభుత్వం జూన్ నెల మొదటి వారంలో కొలువు తీరింది.

ప్రభుత్వం కొలువు తీరిన మరునాడు నుంచే ఈ ప్రభుత్వం ఫై ఏదో విధంగా బురద జల్లి ప్రజలలో అయోమయం సృష్టించాలన్నదే ఒక వర్గం మీడియా అదే పని గా పెట్టుకుంది. ఎదో ఒక ఊహాగానంతో వార్త రాయడం దానికి లేనిపోనివి జత చేసి విష ప్రచారానికి తెరలేపడం వీరికి పనిగా మారిపోయింది. ఇంతవరకూ పోలవరం రి టెండర్లు, పీపీఏల పునపరిశీలన, తాజాగా రాజధాని తరలింపు వంటి అంశాలు ఫై విష ప్రచారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకపోవటంతో ఈ విష ప్రచారానికి ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవటం తో ఇప్పుడు ఇద్దరు కీలక అధికారులు ఫై వీరి దృష్టి పడింది.

ముఖ్యమంత్రి తమ మాట వినటం లేదని ఈ ఇద్దరు అధికారులు మదన పడుతున్నారని, త్వరలోనే వీరు ఇద్దరూ తమ స్థానాలనుంచి వైదొలగుతున్నారని కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ రాతలు తో ప్రభుత్వానికి ఏమాత్రం డోఖా లేదని వీరికి తెలిసినా, ఏదో గందరగోళం సృష్టించి ఏదో అలజడి సృష్టించడానికి నానా పాట్లు పడుతున్న వీరి బాధ వెనక అసలు నగ్న సత్యం వేరేగా ఉంది. గత ప్రభుత్వం తమకు అడదిడ్డంగా జారీ చేసిన బిల్లులు గత మూడు నెలల నుంచి విడుదల కాకపోవటమే.

తమవారి పేపరు కానీ వార మాస పత్రికలూ అయితే ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు జారీ చేయించుకోవటం, ఒకవేళ ప్రకటన రాకపోతే వారిని బ్లాక్ మెయిల్ చేయటం వీరికి ఒక అలవాటుగా ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాకపోవటంతో ఎంత తొందరగా ఈ ప్రభుత్వంను  అప్రతిష్ట చేయాలన్న దుర్బుద్ధి తో ఈ విష ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు ఈ పచ్చ మీడియా కి ఇద్దరు అధికారులపై ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్నికలకు ముందు ఈ అధికారులఫై ఇష్ట వచ్చినట్లు విష ప్రచారం చేసిన ఈ బృందంకు ప్రస్తుతం వారి ఫై ప్రేమ పుట్టుకొచ్చినట్లు ప్రచారం మొదలు పెట్టడానికి చాలా పెద్ద కారణమే ఉంది. బైటకి ప్రేమ కురిపిస్తున్నట్లు కనిపించినా లోన మాత్రం ఆ ఇద్దరు అధికారులఫై తమకున్న విషాన్ని పరోక్షంగా కక్కుతున్నారు.  

ఈ ఇద్దరు అధికారులు ఎవరంటే ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం కాగా  ఇంకొకరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం. వీరి ఇద్దరి మాట ముఖ్యమంత్రి వినటం లేదని, దీంతో ఈ ఇద్దరు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారని, త్వరలోనే వీరు బైటకు వచ్చేస్తారని వీరి విష ప్రచారం సారాంశం. ముఖ్య సలహాదారు గా ఉన్న అజేయకల్లం తనకున్న సుదీర్ఘ అనుభవంతో ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఏవిధమైన అవినీతికి ఆస్కారం లేకుండా పాలనా యంత్రాన్గానికి దిశా నిర్దేశం చేస్తుంటే ఆయన మాట ముఖ్యమంత్రి వినటంలేదని అందుకు ఆయనలో తీవ్ర అసహనం కూడగట్టుకుందని దానితో ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నారని  తప్పుడు ప్రచారానికి లేవదీసారు.

అయితే ఈ విష ప్రచారం వెనుక మరొక సాకు కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో వీరు ఆడిందే ఆటగా సాగింది. ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతూ కులం కార్డు చూపించి తమ పైరవీలు యధేచ్ఛగా జరుపుకున్నారు. ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది. పైరవీకారుల ఆటలు గతం లాగా సాగటం లేదు. జర్నలిస్ట్ ముసుగుకి కులం కార్డు చూపించి గతంలో సాగిన విధం గా దందా సాగకపోవటంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఫై అవాకులు చవాకులు ప్రచారం చేసి లబ్ది పొందాలన్నది వీరి దురాశ. నిజాయితీ గల అధికారులని ఒక పక్క ప్రచారం చేస్తూనే వారి ఆత్మ స్థయిర్యం దెబ్బ తినే విధం గా అసత్యాలు ప్రచారం చేయటం ఎంతవరకూ  సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రణాళికలో పొందు పరిచిన హామీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం, వాటి అమలుకు నిజాయితీగల అజేయకల్లం లాంటి అధికారులు కృషి చేస్తుండడం ఒకవర్గం మీడియా కి కంటగింపుగా మారింది. అదేవిధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి గా నియమితులైన ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఫై అప్పట్లో ఇదే పచ్చ మీడియా నానా యాగీ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి చేసిన నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ప్రధాన కార్యదర్శి ది. ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం ఆయన నడుచుకుంటారు. ఇక్కడ అసంతృప్తి అసహనం అనే పదాలకు చోటే లేదు. అయితే ఒక వర్గం మీడియా కొత్త ప్రచారం లేవనెత్తి ప్రజలేకాదు అధికారులు కూడా ముఖ్యమంత్రి పట్ల అసంతృప్తిగా ఉన్నారని కొత్త నాటకానికి తెరతీయటం అసలు ఉద్దేశం.

అయితే ఎంత విష ప్రచారం చేసినా 2024 వరకూ తమ ఆటలు సాగవు కనుక ఎదో చెత్త ప్రచారం చేయాలన్నది వారి లక్ష్యం.

ramakrishna-mutnuru-1
ముట్నూరు రామకృష్ణ                           

Related posts

గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు

Satyam NEWS

డోంట్ కం :ఎంఐఎంపార్టీ కరీంనగర్ అధ్యక్షుడు రాజీనామా

Satyam NEWS

వంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్

Satyam NEWS

Leave a Comment