32.2 C
Hyderabad
March 29, 2024 00: 19 AM
Slider ప్రత్యేకం

కరోనా నుంచి నా కుటుంబాన్ని కాపాడుకునేది ఎలా?

#Coronavirus New

కరోనా వైరస్ నుంచి నా కుటుంబాన్ని ఎలా కాపాడు కోవాలి? అనే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్నగా బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో సర్వేలో తేలింది. బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో కరోనా వైరస్ వ్యాప్తి, ప్రజల మనోభావాలు, వినియోగ మార్కెట్ లపై కరోనా ప్రభావం లాంటి అంశాలపై పలు సర్వేలు నిర్వహించిన ప్రముఖ సంస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ వ్యక్తి దేనికి ప్రాధాన్యతనిస్తున్నాడని తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించారు.

దాని కోసం ప్రధానంగా సర్వే నిర్వహించినపుడు వారి ముందుకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. 1.నేను పనికి వెళ్లాలి. నా పని నేను ఇంటి నుంచి పని చేసేందుకు వీలు కలిగించదు. నేను పని ప్రదేశంలో సురక్షితంగా ఉన్నానా? 2.నేను ఇంటికి ఒక్కడినే వెళుతున్నానా? కరోనా వైరస్ ను వెంట తీసుకువెళుతున్నానా?

3. నా సహచరులు సిక్ లీవ్ పెడితే నేను ఏ విధంగా నా పరిస్థితిని అంచనా వేసుకోవాలి? 4. నేను పని కోసం బయటకు వెళితే నా కుటుంబానికి కరోనా నుంచి రక్షణ లేదు. (మళ్లీ నాతో కరోనా రావచ్చు) అయితే కుటుంబం మొత్తం ఇంట్లో ఉన్నా సురక్షితమేనా? ఎందుకంటే కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నదటకదా?

5. నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే నేను ఏం చేయాలి? 6. కరోనా వచ్చిందని అనుమానం వస్తే ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వాలి? ఎవరి దగ్గరకు వెళ్లాలి? 7 దగ్గు, జలుబు, జ్వరం రాగానే నేను డాక్టర్ వద్దకు వెళ్లాలా లేక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చేంతవరకూ వేచి చూడాలా?

8. అందరికి రోగ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయా? 9. ఒక వేళ నా కుటుంబ సభ్యులకు కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టులు ఎక్కడ చేయించాలి? ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పరిస్థితి చూస్తున్నాం కదా? అయితే ప్రయివేటు పరీక్షా కేంద్రాలు భద్రమైనవేనా? 10. ప్రయివేటు టెస్టింగ్ కేంద్రాలకు వెళితే ఖర్చు ఎంత అవుతుంది?

మొత్తం నేనే భరించాలా ప్రభుత్వం సహాయం చేయదా? 11.కరోనా పాజిటీవ్ వస్తే తర్వాత ఏం చేయాలి? 104 లేదా 1075 కు ఫోన్ చేస్తే వారు స్పందిస్తారా? 12. ప్రభుత్వ ఆసుపత్రులలో చాలిన్ని పడకలు ఉన్నాయా? కరోనా సోకగానే నాకు నా కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు దొరుకుతాయా?

లేక ప్రయివేటు ఆసుపత్రులలో ఎక్కడైనా ఖాళీ ఉందా అని వెతుక్కోవాలా? 13. పాజిటీవ్ వచ్చినా ఆసుపత్రికి వెళ్లాలా? ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలా? 14. కరోనా సోకితే నా స్నేహితులకు బంధువులకు చెప్పవచ్చా? రహస్యంగా ఉంచాలా?

15. గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది కాబట్టి పక్కనున్న వారికో, సమీపంలోనో కరోనా రోగి ఉంటే నేను ఇంట్లోనే ఉండిపోవాలా? 16. ఆసుపత్రిలో చేరితే ఖర్చు ఎంత అవుతుంది? 17. ఉన్న ఆరోగ్య పాలసీలు కోవిడ్ 19 ను కవర్ చేస్తాయా? ఆసుపత్రులు నా హెల్త్ పాలసీని ఆమోదించకపోతే ఏం చేయాలి?

18. కరోనా సోకిన వారు ఏ ఆహార పదార్ధాలు తినాలి? 19 కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? 20. మల్టీ విటమిన్ టాబ్లెట్లు, జింక్ టాబ్లెట్లు వాడితే నాకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు దాదాపుగా అందరి మనసుల్లో ఉన్నాయని, తాము సర్వే చేసినప్పుడు ఈ ప్రశ్నలన్నీ ప్రజలు వేస్తున్నారని బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో తెలిపింది.

పోలీసులు, బ్యాంకు సిబ్బంది, డాక్టర్లు, వస్తు తయారీ పరిశ్రమలు, నైపుణ్యత కలిగిన పనివారు ఇంటి నుంచి పని చేసే వీలు ఉండదని వారిలో ఇలాంటి ప్రశ్నలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయని బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో వెల్లడించింది.

అన్ని ప్రశ్నల్లోకి ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలనా? అనే ప్రశ్న ఎక్కువ మందిని వేధిస్తున్నదని సర్వేలో తేలింది. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్, ఇతర ప్రసార మాధ్యమాలు ఈ 20 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా ఇవ్వాలని కూడా ప్రజలు కోరుతున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే సాధారణ ప్రజలు కరోనా నుంచి తమ కుటుంబాన్ని కాపాడుకుంటామనే నమ్మకాన్ని కలిగి ఉంటారని  బ్రాండ్ మార్కెట్ రిసెర్చి బ్యూరో అభిప్రాయపడింది.

Related posts

పొలం బాట పట్టి వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య ఉప కేంద్ర సిబ్బంది

Satyam NEWS

నకిలీ డాక్టర్ గుట్టురట్టు

Bhavani

ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి?

Bhavani

Leave a Comment