పాములున్నాయని తెలిసి పాడుబడ్డ బావిలో పడిపోయిన కుక్క పిల్లలను రక్షించిన పోలీసు ధైర్యానికి ప్రసంశల వర్షం కురుస్తుంది.ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాఈ చిత్రాలపై లక్షలాది లైకులు కుమ్మరిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని ఆర్మోహాలో ఓ పాడుబడ్డ బావిలో ప్రమాద వశాత్తు మూడు కుక్కపిల్లలు పడిపోయాయి. బావిలో ప్రమాదకరమైన పాములు ఉండటం తో గ్రామస్తులు అందులోకి దిగడానికి సాహసించలేదు.
స్థానికులు టోల్‌ఫ్రీ నంబర్ 112కు కాల్‌చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని వాటిని బావి గట్టు పైనుండే బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.అందులో ఓ పోలీసు అధికారి బావిలో దిగి ప్రాణాలకు తెగించి ఆ మూడు కుక్కపిల్లలను బయటకు తీసుకొచ్చి వాటి ప్రాణాలు కాపాడారు.స్థానిక ప్రజలు అతన్ని ధైర్యాన్ని కొనియాడగా ,ఆ చిత్రాలను ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విటర్‌లో పోస్టు చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలన్న సందేశాన్ని దానిపై ఉంచింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘బిగ్ సెల్యూట్ టు ఆఫీసర్’ ‘ఇలాంటి వారే భరతమాత ముద్దుబిడ్డలు’ అంటూ కామెంట్లు పెడుతు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.