ఉత్తరప్రదేశ్ లో పెళ్లైన తెల్లవారే నవవధువుపై దారుణం జరిగింది. కాళ్ళ పారాణి అరక ముందే సామూహిక లైంగికదాడికి గురైంది. హాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటన సంచలనం సృష్టించింది.ఇంటి నిండా బంధువుల కోలాహలం సందడిగా ఉన్న ఆ ఇంట్లో పెళ్లికూతురు ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కిడ్నాప్ చేసి మరి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు గుర్తు తెలియని దుండగులు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 17న వివాహన బాధితురాలు అన్ని కార్యక్రమాలు అయిపోవడంతో అత్తింట్లో అడుగు పెట్టింది. ఆ మరుసటి రోజు నే ఆమె కనిపించకుండా పోవడంతో అత్తింటివారు ఆందోళన చెందారు. గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను సంప్రదించారు
ఈ క్రమంలో ఆదివారం హాపూర్‌లోని ఓ బ్యాంకు సమీపంలో అపస్మారక స్థితిలో ఆమెను గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.