బ్రిటన్ లో నూతన వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థపైన కసరత్తు చేస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలియజేశారు.బ్రేగ్జిట్ సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని , ప్రపంచం నలుమూలల నుంచి అత్యధిక వృత్తి నిపుణులను ఇక్కడికి అనుమతించేందుకు వీలుగా వీసా విధానం ఉంటుందని, భారత దేశంతో సహా వివిధ దేశాల నుంచి నిపుణులను ఆహ్వానించ నున్నట్లు ప్రధాని తెలిపారు. తమ దేశం నిపుణులందరికీ ఆహ్వానం పలుకుతుందని ప్రధాని చెబుతున్నారు.
గత వారం బ్రిటన్ మైగ్రేషన్ సలహా కమిటీ సిఫారసులను అంగీకరించినట్టు ,అయితే వృత్తి నిపుణులకు వేతనాన్ని 30 వేల పౌండ్ల నుంచి 25,600 పౌండ్లు కనీస వేతంనంగా నిర్ణయించాలని సిఫారను చేశారు. వచ్చే శుక్రవారం , హోంశాఖ మంత్రి ప్రీతి పటేల్ ప్రభుత్వ ప్రతిపాదనను లాంఛనంగా ప్రకటించ నున్నారు. గురువారం నాటికి మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరగవచ్చునని భావిస్తున్నారు.