35.2 C
Hyderabad
May 29, 2023 21: 10 PM
Slider క్రీడలు

నేషనల్ ఫెడరేషన్ టోర్నీలో ఏపీ పురుషుల సాఫ్టుబాల్ జట్టుకు కాంస్యం

#Softball Team

గోవాలోని పనాజీలో ఏప్రిల్ 30 నుండి ఈనెల 3వ తేదీ వరకు జరిగిన జాతీయ పురుషుల సాఫ్ట్బాల్ ఫెడరేషన్ టోర్నీలో ఏపీ పురుషుల జట్టు అత్యద్భుతమైన ప్రతిభ కనబరచి కాంస్య పతకం సాధించారు. టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనగా ఏపీ జట్టు తృతీయ స్థానం కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోవా యువజన, క్రీడల ప్రిన్సిపాల్ సెక్రటరీ మౌనిక, జాతీయ సాఫ్ట్బాల్ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నీతల్ నారంగ్, జాతీయ సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్ ఆర్ మౌర్య, ట్రెజరర్ శ్రీకాంత్ తోరాట్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఇండియా సీఈఓ ప్రవీణ్ అనౌకర్ హాజరయ్యారు. ముఖ్య అతిథి క్రీడల ప్రిన్సిపల్ సెక్రెటరీ మౌనిక మాట్లాడుతూ ఇటీవల ఏపీ రాష్ట్రం సాఫ్ట్బాల్ క్రీడలో అద్భుతాలు సృష్టిస్తోందని, అనతి కాలంలోనే సాఫ్ట్బాల్ లో జాతీయ స్థాయిలో అంచలంచెలుగా ఎదుగుతూ సాఫ్ట్బాల్ అంటేనే ఏపీ అన్న రీతిలో రాణిస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ సీ.ఈ.ఓ శ వెంకటేశులుతో పాటు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఈఓ సి.వెంకటేశులు ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే ఏడాది జాతీయ క్రీడలు గోవాలో జరుగుతాయని, ఈ పోటీలకు సాఫ్ట్బాల్ పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయని, ఏపీ రాష్ట్రం చక్కటి ప్రతిభ కనబరిచి పతకం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ పురుషుల జట్టు కు మెడల్ తో పాటు కప్పును అందజేశారు.

Related posts

‘సాక్షి’ పై కేసు: కోర్టు ఆదేశాలతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు

Satyam NEWS

బాసర ఆలయాన్ని సందర్శించిన కమిషనర్

Satyam NEWS

ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుదల‌

Sub Editor

Leave a Comment

error: Content is protected !!