27.7 C
Hyderabad
April 25, 2024 09: 09 AM
Slider రంగారెడ్డి

కబ్జాకు పాల్పడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్

#kunasrisailam

రేణుక ఎల్లమ్మ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్ రేణుక ఎల్లమ్మ కాలనీకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని, బీఆర్ఎస్ కార్పొరేటర్ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రేణుక ఎల్లమ్మ కాలనీ వెల్ఫేర్  అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు ధర్నాకు దిగారు. కాలనీ వసూలు చేస్తున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ విచ్చేసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ  కాలనీ కి  సంబంధించి 1989 లోనే పార్క్ తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కి కేటాయిస్తూ లేఔట్ వేయడం జరిగిందని తెలియజేశారు. కార్పొరేషన్ పరిధిలో స్థలానికి భారీగా రేటు పలుకుతుండడంతో  ఇప్పుడు స్థానిక బిఆర్ఎస్ నేతలు కబ్జా చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని కబ్జా చేస్తుంటే కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లడారు.

ఇప్పటికైనా చర్యలు తీసుకోక పొతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిజాంపేట్ అధ్యక్షుడు ఆకుల సతీష్, రంపం కాశి, కౌశిక్, ఉదయ్, మరియు కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరోత్తం రెడ్డి, రఘు  నరేంద్ర కుమార్, చంద్రారెడ్డి, కాలనీ వాసులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ: పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన తల్లి

Satyam NEWS

ఎర్రకోటను తాకిన వరద నీరు

Bhavani

నదీజలాలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖాస్త్రం

Satyam NEWS

Leave a Comment