36.2 C
Hyderabad
April 23, 2024 22: 05 PM
Slider హైదరాబాద్

విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం                                    

#kaleru

అంబర్పేట్ మండల స్థాయి ప్రభుత్వ పదవ తరగతి  విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం అంబర్పేట సిపిఎల్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి అంబర్పేట్ మండల స్థాయిలోని 9 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థునుల తల్లిదండ్రులని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యా సంస్థలలో అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పదవ తరగతి విద్యార్థుల  ఉత్తీర్ణత శాతం పెరిగిందని, అనేక గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ జోన్ ఉప విద్యాధికారి విజయలక్ష్మి, అంబర్పేట్ డిప్యూటీ ఐఓఎస్ నిజాముద్దీన్, పోలీస్ బాయ్స్ పాఠశాల ప్రిన్సిపల్ మాధురి, మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజగోపాల్ నాయుడు, రంగు సతీష్ గౌడ్, మహేష్ ముదిరాజ్, మోహన్, రాఫిక్, లోకేష్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

బ్రాహ్మణులకు నిత్యావసరాలు ఇచ్చిన గాయత్రి సొసైటీ

Satyam NEWS

హయాత్ మీటింగ్: ఎట్టకేలకు స్పందించిన బిజెపి

Satyam NEWS

వరంగల్ మెంటల్లీ ఛాలెంజ్ డ్ స్కూల్ లో పతాకావిష్కరణ

Satyam NEWS

Leave a Comment