30.7 C
Hyderabad
April 19, 2024 09: 15 AM
Slider కరీంనగర్

దేశ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలకశక్తి గా బీఆర్ఎస్

#koppula

తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ TRS పార్టీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల తో మాట్లాడుతూ ఎవరికి అంతుబట్టని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. TRS పార్టీని BRS మార్చడాన్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న వ్యక్తి అని ఆయనకు అనేక విషయాలపై అవగాహన ఉండదని 60 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే కోల్పోయామో అవన్నీ సమకూర్చి తెలంగాణ ను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిదిన గొప్ప వ్యక్తి చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా BRS పార్టీ పెట్టడం జరిగిందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని వనరులను ఏవిదంగా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయక తీవ్ర ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్నామని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని సాగుకు అనుకూలమైన భూములను కూడా సాగు విస్తీర్ణం పెంచడంలో బీజేపీ పార్టీ విఫలమైందని చెప్పారు.

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ఆవిష్కృతo అయ్యిందని తెలిపారు. రైతుబంధు, దళిత బంధు కేంద్రం ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. రాష్ట్ర పథకాలు దేశ ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అంతకుముందు థరూర్ క్యాంపులో 1 కోటి రూపాయల తో నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనానికి భూమి పూజ నిర్వహించారు. గ్రంథాలయలు యువతకు, విద్యార్థుల అభివృద్ధికి దోహద పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గ్రంతలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, డిసీఎంఎస్ చైర్మన్ శ్రీకాత్ రెడ్డి, మాజీ మంత్రి రాజేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

Satyam NEWS

జయహో భారత్: మా దేశ భక్తి ముందు కరోనా తల వంచాల్సిందే

Satyam NEWS

అక్రమ కేసులు సహించం

Bhavani

Leave a Comment