27.7 C
Hyderabad
April 25, 2024 09: 59 AM
Slider జాతీయం

సరిహద్దుల్లో భారీగా మందుగుండు సామాగ్రి పట్టివేత

#indopakboarder

ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) మూడు ఏకే-47 రైఫిళ్లు, మూడు మినీ ఏకే-47 రైఫిళ్లు, మూడు పిస్టల్స్ స్వాధీనం చేసుకుంది. ఘటనా స్థలం నుంచి 200 రౌండ్ల మందుగుండు సామాగ్రి (100 రౌండ్ల రైఫిల్, 100 రౌండ్ల పిస్టల్) కూడా స్వాధీనం చేసుకున్నట్లు BSF అధికార ప్రతినిధి తెలిపారు. సరిహద్దు గార్డు పోస్ట్ దగ్గర సైనికులు గస్తీ తిరుగుతుండగా ఇవి దొరికినట్లు తెలిపారు.

జగదీష్ (Ex-136) జీరో లైన్ దగ్గర కొన్ని అనుమానాస్పద వస్తువులను కనుగొన్నాడు. అందులో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. దీన్ని ఐఎస్‌ఐ ఏజెంట్లు సరిహద్దు నుంచి పంపే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. BSF సిబ్బంది మూడు AK-47 రైఫిల్స్‌తో పాటు ఆరు ఖాళీ మ్యాగజైన్‌లు, మూడు మినీ AK-47 రైఫిల్స్‌తో ఐదు ఖాళీ మ్యాగజైన్‌లు మరియు మూడు పిస్టల్స్ (బెరెట్టా రకం) ఆరు ఖాళీ మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం సీజ్ చేసి బిఎస్‌ఎఫ్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి చర్యల కోసం పంజాబ్ పోలీసులకు కేసు అప్పగించారు. BSF అధికారుల ఫిర్యాదుపై, ఫజిల్కాలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25, 54, 59 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Related posts

ఈడి కేసులో హైకోర్ట్ కు నామా

Murali Krishna

కృష్ణా జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్య

Satyam NEWS

తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment