27.7 C
Hyderabad
March 29, 2024 04: 26 AM
Slider జాతీయం

లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

మధ్యప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాంబాయ్ స్వచ్ఛందంగా అందించే లంచాలను స్వీకరించవచ్చని చెప్పడం వివాదాస్పదమైంది. కానీ లంచం డిమాండ్ చెయ్యొద్దని చెప్పారు. రాష్ట్ర పంచాయితీ అధికారుల సమక్షంలో దామోహ్ జిల్లాలోని తన నియోజకవర్గం పఠారియాకు చెందిన కొంతమంది గ్రామస్థుల మధ్య జరిగిన సంభాషణలో ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు విడుదల చేయడానికి లంచలు ఇవ్వాల్సి వచ్చిందని గ్రామస్థులు ఆరోపించారు. ఎంత చెల్లించారని ఎమ్మెల్యే వారిని అడిగారు. అప్పుడు వారు సమాధానమిస్తూ రూ.5,000 నుంచి రూ .9,000 వరకు చెల్లించామని చెప్పారు. రూ.500 లేదా రూ .1,000 తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదని అధికారులతో అన్నారు. కానీ ఎక్కువ మొత్తం డిమాండే చెస్తే బాగుండదని చెప్పారు. నెలకు రూ .6,000 సంపాదించడానికి ఈ గ్రామస్థులు కష్టపడుతున్నారని, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీనిపై ఎమ్మెల్యేను సంప్రదించగా భారతదేశం అంతటా ప్రభుత్వ వ్యవస్థలో ఇదే పరిస్థితి ఉందని చెప్పారు.

Related posts

హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

Satyam NEWS

కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి

Satyam NEWS

రాజానగరం హైస్కూల్ లో దారుణం

Satyam NEWS

Leave a Comment