31.7 C
Hyderabad
April 25, 2024 01: 55 AM
Slider నల్గొండ

25న హుజూర్ నగర్ ‘కార్మిక కర్షక పోరు’జయప్రదం చేయండి

#Roshapati

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కార్మిక కర్షక పోరుయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికుల  పని ప్రదేశాలలో ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా భవన,ఇతర నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను, కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, ప్రజలందరికీ వివరిస్తామని చెప్పారు.

క్రొత్త వ్యవసాయ కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని,  జనవరి 20 నుండి ఫిబ్రవరి 2వ, తేదీ వరకు, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ‘కార్మిక కర్షక పోరు’ యాత్రలో భాగంగా జనవరి 25న, హుజూర్ నగర్ పట్టణానికి రానున్న ‘కార్మిక కర్షక పోరు’ యాత్రను జయప్రదం చేయటానికి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు కదలిరావాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 7500 రూపాయలు ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ ఉన్న  క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని, నాణ్యమైన వెల్ఫేర్ బోర్డు కార్డులు కార్మికులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న  ఉపాధ్యక్షులు పల్లపు రామకృష్ణ, నరేష్, వీరయ్య, మల్లన్న, సైదులు, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రసాయనిక ఎరువులు తగ్గించాలి సేంద్రీయ ఎరువులు పెంచాలి

Bhavani

పన్నుల పెంపు అంశంపై అధికార పార్టీ వివరణ ఇది…!

Satyam NEWS

వనపర్తి మున్సిపాలిటీలో  పరిపాలన విఫలం

Satyam NEWS

Leave a Comment