39.2 C
Hyderabad
April 25, 2024 17: 51 PM
Slider మహబూబ్ నగర్

శ్రీరామలింగేశ్వర బ్రహ్మోత్సవాలలో ఉత్సాహంగా ఎద్దుల పోటీలు

#bullfight

వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్ గల్ మండలం రేమొద్దుల గ్రామం లో అత్యంత ఆసక్తిగా అంతర్ రాష్ట్ర ఎద్దుల పోటీలు జరిగాయి. 10 జతల ఎద్దులు బండ లాగుడు పోటీలలో పాల్గొన్నాయి. శ్రీ శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని  రేమద్దుల గ్రామం లో అంతర్ రాష్ట్ర స్థాయి బండ లాగుడు ఎద్దుల బండ లాగుడు పోటీలను టీపీసీసీ  కార్యదర్శి డాక్టర్. కేతూరి వెంకటేష్ ప్రారంభించారు.

రైతు సంతోషం కోసమే రైతు సంబురాలు నిర్వహిస్తున్నట్లు కేతూరి వెంకటేష్ తెలిపారు. రైతులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారని ఇది శుభ సూచకమని ఆయన అన్నారు. గతంలో పోటీల్లో పాల్గొన్న ఎద్దులు కాకుండా కొత్తగా, మొదటి సారిగా పోల్గొంటున్న ఎద్దులకు కూడా అవకాశం ఇచ్చారు.

రైతులు ఎద్దులను శ్రద్ధగా చూసుకోవాలనే ఆలోచనతోనే ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 10 జతల ఎద్దులు యజమానులకు శాలువా, బహుమతులు  తో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు టీపీసీసీ కార్యదర్శి కేతూరి వెంకటేష్ ని గజమాలతో సత్కరించారు.

శ్రీ శివ శంకర హమాలి సంఘం ఈ పోటీలను నిర్వహించింది. సర్పంచ్ మోటూరి మంజుల, తిరుపతయ్య, ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి ఈ పోటీలకు సహకరించారు. ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ నాయుడు, ఈశ్వర్, జంగయ్య చారి, జనుమపల్లి పసుపుల నాగేంద్రం, సాయి, శివ ప్రసాద్, ముoత రాము యాదవ్, తిరుమలేష్, బాలు, శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే

Satyam NEWS

R V టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు

Satyam NEWS

తిరుమలలో 9న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

Satyam NEWS

Leave a Comment