కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మానేపూర్ గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి ఎంపిపి అశోక్ పటేల్జ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి ఉపాధి హామీ నిధుల ద్వారా వైకుంఠధామం నిర్మాణానికి నిధులు కేటాయించబడ్డాయని కావున సర్పంచ్లు వైకుంఠ ధామ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
కార్యక్రమంలో ఎంపిపితో పాటు సర్పంచ్ దాసరి రాములు మాజీ జడ్పీటీసీ సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, సీతారాంపల్లి సర్పంచ్ గంగారెడ్డి, బిచ్కుంద గ్రామ అధ్యక్షులు బొమ్మల లక్ష్మణ్, ఉపసర్పంచ్ సాయిలు, బాలా బోయి వినోద్, దాసరి సాయిలు, ముప్పిడి బాలయ్యతో పాటు పంచాయతీ కార్యదర్శి మనోజ్ ఉపాధి హామీ అధికారులు, ఇసీ భిక్షపతి పాల్గొన్నారు.