34.2 C
Hyderabad
April 19, 2024 20: 07 PM
Slider మహబూబ్ నగర్

లాక్ డౌన్ ను అడ్డుపెట్టుకొని వ్యాపారుల దోపిడి

#General Stores

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు ప్రవర్తిస్తున్నారు. ఈ రెండు మూడు రోజులనుండి డివిజన్ పరిధి లోని  కొన్ని గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో మళ్లీ గతంలో లాగానే సరుకులు దొరకవని నాగర్ కర్నూల్ జిల్లా రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుందని చిన్న గ్రామాల వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేస్తూ నిత్యావసర సరుకులను అధిక రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

కొన్ని నిత్యావసర వస్తువులను కొరత సృష్టిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బడా వ్యాపారులు చిరు వ్యాపారస్తుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇదిలావుండగా గత రెండు  రోజుల్లో హైదరాబాదుకు వెళ్లి సరుకులు ఖరీదు చేసి తిరిగి వచ్చిన  వ్యాపారికి కరోనా సోకిందని పలువురు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలుసని కాని వారు పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఇవి పుకార్ల నిజమా తేలాల్సి ఉంది. మొత్తం మీద  పట్టణ బడా వ్యాపారులకు మాత్రం ఈ కరోనా లాభసాటిగా ఉందనే చెప్పుకోవాలి.

Related posts

ఫైండింగ్ నిర్మల:ఆర్థికశాఖ మంత్రి లేకుండానే బడ్జెట్‌ సమావేశమా ?

Satyam NEWS

విభజన సమయంలో విడిపోయిన సోదరుడిని కలుకోడానికి పాక్ అంగీకారం

Satyam NEWS

చుక్కలను చూపిస్తున్న పసుపు, కుంకుమ ధరలు…

Satyam NEWS

Leave a Comment