33.2 C
Hyderabad
April 26, 2024 01: 54 AM
Slider మహబూబ్ నగర్

GST fear: కల్వకుర్తిలో వ్యాపారుల లాక్ డౌన్

#KalwkurthyBundh

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. అదేదో కరోనా భయంతో కాదు. లాక్ డౌన్ అనే పదాన్ని కరోనా కష్టకాలంలో నే విన్నాము. 

గత సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభణతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా ఇప్పుడు కల్వకుర్తి పట్టణంలో వ్యాపారస్తులు వారు చేసే జీరో వ్యాపారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడి జిఎస్టి స్పెషల్ గద్వాల టీం కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారనే సమాచారంతో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకున్నారు.

గద్వాల స్పెషల్ టీం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కల్వకుర్తి కి చేరుకున్నారు. కాగా హైదరాబాద్ చౌరస్తాలో ఓ వ్యాపారి  ప్లే వుడ్ లక్ష రూపాయల విలువ చేసే సామాగ్రిని దిగుమతి చేస్తుండగా గద్వాల జిఎస్టి అధికారులు తనిఖీ చేయగా జిఎస్టి బిల్లు లేకుండా పట్టుబడింది. కాగా అధికారులు లక్ష రూపాయల విలువ గల ప్లే వుడ్ సి జి ఎస్ టి కింద తొమ్మిది శాతం ఎస్ జి ఎస్ టి కింద తొమ్మిది శాతం మొత్తం 18 శాతం తో పాటు మరొక 18 శాతం అపరాధ రుసుము గా మొత్తం 36 వేల రూపాయలను చాలానా కట్టించారని సమాచారం. 

అధికారులు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోయారు. పట్టణంలో  పూర్తి ఎలాంటి సమాచారం తెలియకుండానే అధికారులు వచ్చారనే ఒక్క సమాచారం మాత్రమే తెలిసిన వ్యాపారస్తులు వారి దుకాణాలకు తాళాలు వేసి పరుగుతీశారు.

పట్టణంలో మొత్తం జీరో వ్యాపారం

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అన్ని వ్యాపారాలు మొత్తం ప్రభుత్వ టాక్స్ కట్ట కుండానే ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ఏ వ్యాపారి జి ఎస్ టి లైసెన్స్ ఉన్నను పగడ్బందీ గా వ్యాపారం చేయడం లేదు. కోట్లలో టర్నోవర్ ఉన్న వ్యాపారి సైతం వినియోగదారుడికి జిఎస్టి బిల్లు ఇవ్వటంలేదు.

ఎలక్ట్రికల్, హార్డ్వేర్, పెయింట్స్, ఇంజనీరింగ్ వర్క్స్ మొదలగు వాటికి సంబంధించిన వస్తువులకు 18 శాతం పన్ను ఉంటుంది. ఒక్క కల్వకుర్తి పట్టణంలోనే ఈ వ్యాపారం నెలకు కోట్లలో  ఉంటుంది. ఒక కోటి రూపాయల వ్యాపారానికి 18 లక్షల రూపాయలు మన ప్రభుత్వానికి చేరుకోవాలి.

కానీ వ్యాపారస్తుల ఇళ్లలో బ్లాక్ మనీ గా పోగు అవుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులు నిజాయితీగా వ్యాపారం చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరగడమే గాక నలుగురు అకౌంటెంట్స్ భృతి కలుగుతుంది. మార్చి నెలలో మాత్రమే కనిపించే ఈ అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి తనిఖీలు నిర్వహిస్తే కోట్లలో పన్నుల రూపేణా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.

నిత్యవసర వస్తువులు తగ్గుతాయి నలుగురికి జీవన ఉపాధి దొరుకుతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దిశగా అధికారులు విధులలో నిర్లక్ష్యం వహించకుండా కఠినంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీధర్, సత్యం న్యూస్

Related posts

ఏపిలో శాశ్వత మూత దిశగా సినిమా ధియేటర్లు

Satyam NEWS

కాశ్మీర్ పై వక్రీకరణ ఇక కుదిరేపని కాదు

Satyam NEWS

ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు

Satyam NEWS

Leave a Comment