28.2 C
Hyderabad
April 20, 2024 12: 23 PM
Slider మహబూబ్ నగర్

2000 నోటుతో లాభ సాటి వ్యాపారం

#cash

ఇటీవల ఆర్బిఐ 2000 నోటు పై తీసుకున్న విధానంపై లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఆర్బిఐ 2000 నోటును సెప్టెంబర్ లోగా తమ తమ బ్యాంకు అకౌంట్లో వేసుకోవాలని సూచించిన వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొందరు వ్యాపారులు దళారులు 2000 నోటు పై అధిక మొత్తంలో కమిషన్లు తీసుకుంటూ లాభసాటి వ్యాపారం చేస్తున్నారు.

కొందరు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో భాగంగా సరుకులు కొనేవారికి చెల్లదని మేము తీసుకోమని చెబుతూనే 2000 కు గాను 300 200 కమిషన్ను లెక్కగడుతు సందట్లో సడే మియాలా దోచుకుంటున్నారు.

పురాణాల్లో భక్త సులభుడు ఈశ్వరుడు ఇచ్చే వరాలతో వరగర్వంతో రాక్షసులు రెచ్చిపోయి నరులను పీడిస్తుంటే నర నారాయణుడు విష్ణుమూర్తి వారి చావును తిరగరాస్తు ధర్మసాంస్థాపనకై శ్రీహరి వారిని సంహరించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు పురాణాలు విన్నాం. కాగా నల్లధనాన్ని దేశ రక్షణకై ఏదో ప్రజలకు మేలు చేయాలనే భావనతో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను కూడా తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కొందరు దళారులు.

2000 నోటును కమీషన్లకు సేకరించిన వ్యాపారస్తులు
మొత్తాన్ని వారు కొనుగోలు చేసిన సరుకులకు డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించి మార్చుకుంటున్నారు.కాగా గతంలో కనీసం చూడాలనుకున్న 2000 కనిపించే ది కాదు ఎప్పుడో ఒకసారి ఒకనోటు రెండు నోట్లు కనిపిస్తేనే గగనం అన్నట్టుగా ఉండేది. అటువంటిది ప్రస్తుతం ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఎక్కడ చూసినా ఎవరి చేతిలో చూసినా 2000 నోట్లు అధిక మొత్తంలో దర్శనమిస్తున్నాయి.కూరగాయలు,పాలు, కొనుగోలు సమయంలో దాదాపు అన్ని చోట్ల 2000 నోటు కనిపించడంపై సామాన్యుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎటు పోయింది ఈ నోటు ఏడ దాగి ఉందనే ప్రశ్నలు కోకోల్లలుగా వినిపిస్తున్నాయి.

ఈ 2000 నోటుతో బంగారం కొనుగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్లు పొలాలు క్రయవిక్రయాలపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఈ 2000 నోటుతోనే చెల్లిస్తున్నారు. మొత్తం మీద బ్యాంకులకు అధిక మొత్తంలో ఈ 2000 నోటుతోనే లాకర్లు నిండిపోతాయనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం పెండ్లిలు, శుభకార్యాలు అధిక మొత్తంలో జరగడంతో వ్యాపారస్తులు మధ్య పేద వర్గాలను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా రెండు వేల నోటు పై వ్యాపారం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Related posts

భావన టౌన్షిప్ పై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి

Bhavani

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

Satyam NEWS

ముస్లిం సోదరులకు ఉత్తమ్ బక్రీద్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment