36.2 C
Hyderabad
April 23, 2024 21: 13 PM
Slider శ్రీకాకుళం

మజ్జిగ పంపిణీ చేసిన రామ్ చరణ్ అభిమానులు

#Ramcharan

ప్రముఖ యువ సినినటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న మాసోత్సవాలలో భాగం బుధవారం ఆయన అభిమానులు శ్రీకాకుళం నగరం లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నగరంలోని హెడ్ ఫోస్టాఫీసు వద్ద మెగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసారు.

ఈ చలివేంద్రాన్ని సీనియర్ జర్నలిస్టు ఎం. సుధీర్ వర్మ, రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్, శ్రీకాకుళం జిల్లాలో రామ్ చరణ్ యువశక్తి జిల్లా ప్రతినిధి మజ్జి గౌతమ్లతో కలిసి ప్రారంభించారు.  అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు,రామ్ చరణ్ యువశక్తి రాష్ట్ర ప్రతినిధి శివ చెర్రి  పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో రామ్ చరణ్ యువశక్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చల్లటి మజ్జిగను పంపిణీ చేసి వేసవి ఎండతో సతమతమవుతున్న వారి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం…దాహంతో ఉన్న వారి దాహం తీర్చడం ,ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానం చేయడం వంటి సేవా కార్యక్రమాలలో మెగా అభిమానులు ఎప్పుడు ముందుఉంటారన్నారు.

సమాజ సేవా కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ ఇతరులకు వారు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. భవిష్యత్ లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి సమాజం మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను మాట్లాడుతూ రామ్ చరణ్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాసోత్సవాలలో అభిమానులు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు కోవిడ్ పై ప్రజలకు అవగాహన కలిగించేలా ఫ్లాష్ మోప్ తదితర కార్యక్రమాలను నిర్వహించారన్నారు. వేసవి ఎండలు మండుతున్న తరుణంలో ఒక్క రోజు మెగా చలివేంద్ర ఏర్పాటు చేసి ప్రజలు దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో మెగా అభిమానులు ఎప్పుడు ముందుఉంటారన్నారు.భవిష్యత్ లో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేసారు.

ఈ కార్యక్రమంలో ఎఐమ్ ప్రతినిధి మాతా శామ్యూల్ సుధాకర్ , రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధులు  నాని,చరణ్ ఇజం , హరీష్ ,చరణ్ తేజ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్ ,తాలాడ  శేఖర్ , అల్లు ఉదయ్ ,భాను బన్నీ ,వెంకీ గణ, అనిల్,సిద్దు, పండు,సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , కిరణ్ , మౌళి , ఖాదర్ వరుణ్ తేజ్ అభిమాన సంఘం కార్యదర్శి శీర రాజు ,అభిమానులు  నాని రాయల్ , వడ్డీ శ్రీను, భద్రి ,కామేశ్వరరావు, పెయ్యల చంటి,మురళీ  తదితరులు  పాల్గొన్నారు.

Related posts

Trespassing: కోర్టు ఆర్డర్ ఉన్నా యథేచ్ఛగా ఆక్రమణ

Satyam NEWS

రెయిన్ హవాక్: హైదరాబాద్ నగరంలో వడగండ్ల వాన

Satyam NEWS

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని

Satyam NEWS

Leave a Comment