31.2 C
Hyderabad
April 19, 2024 04: 24 AM
Slider హైదరాబాద్

కంటి వెలుగు వైద్య బృందాన్ని అభినందించిన సి.ఎస్ శాంతికుమారి

#C. S. Shantikumari

గత పది రోజుల నుండి బిఆర్కేఆర్ భవన్ లోని సచివాలయ అధికారులకు, ఉద్యోగులకు నిర్వహించిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొన్న నేత్ర వైద్యులు, వైద్య సిబందిని రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డి.హెచ్.ఎం.ఓ డా. ఏ.పద్మజ ఆద్వర్యంలోని19 మంది వైద్య బృందం జనవరి 23 న సచివాలయ అధికారులు, సిబ్బందికి నేత్ర పరీక్షలు నిర్వహించాయి.

నేటితో ముగిసిన ఈ కంటి వెలుగు నేత్ర పరీక్షల్లో భాగంగా 1240 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డా. పద్మజ వెల్లడించారు. వీరిలో 550 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించగా, 404 మందికి రెఫరల్ కళ్ళద్దాలను అందించనున్నట్లు తెలిపారు. కాగా, గత పదిరోజులుగా కంటి వెలుగు శిబిరంలో పాల్గొన్న వైద్యులు, వైద్య సిబందిని సి.ఎస్ శాంతి కుమారి అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు దీప్తి ప్రియాంక, మనోజ్ రెడ్డి, మాధురి లతోపాటు సందీప్, దాసీ రెడ్డి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

22న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

బక్కోడి చేతికి బందుకు పట్టించిన సాయుధ పోరాటం

Satyam NEWS

శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా విశేష సాంస్కృతిక కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment