32.7 C
Hyderabad
March 29, 2024 11: 04 AM
Slider ప్రత్యేకం

ఇన్వెస్టిగేషన్: సిఏఏ వ్యతిరేక ఆందోళనల ఖర్చు రూ.120 కోట్లు

caa agitation

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం దేశంలో ముస్లింలకు అన్యాయం చేసేందుకు తీసుకువచ్చారని ప్రతి సభలో ముస్లిం నేతలు చెబుతూనే ఉన్నారు. పౌరసత్వ చట్టంతో బాటు ఎన్ ఆర్ సి, ఎన్ పి ఏ లను కూడా వీరంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది తప్పా? ముస్లిం సంఘాల, ప్రతిపక్ష పార్టీల పార్టీల వాదన తప్పా అనే విషయాలను పక్కన పెడితే దేశం మొత్తం ఇంత పెద్ద ఎత్తున ముందే అనుకున్నట్లుగా ఇంత కాలం పాటు నిరసనలు ఎలా కొనసాగుతున్నాయి? అంతే కాదు ఒక చోట ఆగితే మరో చోట ఇలా ఆగకుండా నిరసనలు కొనసాగించడం మామూలు పరిస్థితుల్లో సాధ్యం అవుతుందా? అని ఆలోచిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తర ప్రదేశ్ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అనే సంస్థ ఒకటి ఉంది. పౌరసత్వ చట్టం సంబంధిత అంశాలపై అల్లర్లు జరిపేందుకు, ప్రదర్శనలు కొనసాగించేందుకు ఇప్పటికి రూ. 120 కోట్లకు పైగా ఈ సంస్థ ఖర్చు చేసినట్లు పోలీసు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 73 బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిలో ఈ రూ.120 కోట్లు డిపాజిట్ చేశారు. వాటిని వివిధ మార్గాలలో పంపిణీ చేశారు.

ఇప్పుడు ఈ 73 బ్యాంకు ఖాతాలలో ఒక్క పైసా కూడా లేదు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక్క సంస్థ పేరుతోనే 27 బ్యాంకు ఎకౌంట్లు ఉన్నాయి. మరో 9 బ్యాంకుల్లో రిహాబ్ ఇండియా ఫౌండేషన్ పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచారు. మిగిలిన ఎకౌంట్లు అన్నీ వివిధ వ్యక్తుల పేరుతో ఉన్నాయి.

డిసెంబర్ 4న సిఏఏ బిల్లు పాస్ కాగానే ఈ ఖాతాల నుంచి డబ్బు విడుదల కావడం ప్రారంభం అయింది. ఈ బ్యాంకులకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడకు వెళ్లాయి అనేది ఇంకా విచారణ లో ఉంది. దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఆందోళనల తేదీలతో ఈ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విడుదల తేదీలు సరిపోల్చుకుని చూస్తే ఆందోళనలకు ఫండింగ్ జరిగినట్లు అర్ధం అయింది. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై విచారణ చేయగా ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో కూడా ప్రమేయం ఉన్నట్లు కూడా వెల్లడి అయింది. తాము అరెస్ట్ చేసిన పీఎఫ్ఐ 25 మంది సభ్యులకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఉత్తర ప్రదేశ్ పోలీసులు చెప్పారు.

Related posts

ఏజెన్సీలో విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు

Satyam NEWS

లింగ నిర్ధారణ పరీక్షలపై నిరంతర పర్యవేక్షణ

Satyam NEWS

వైఎస్సార్ టిపి జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బోరికి సంజీవ్

Satyam NEWS

Leave a Comment