28.7 C
Hyderabad
April 20, 2024 09: 19 AM
Slider జాతీయం

క్లారిటీ: రాష్ట్రాలు తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం

nakhivi

పౌరసత్వ సవరణ చట్టాన్ని విరమించుకోవడం సాధ్యం కాదని జమ్ము కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఇది అమలులో ఉంది అని , కేంద్ర అల్పసంఖ్యాక వర్గాల శాఖ మంత్రి ముఖ్తర్ ఆబ్బాస్ నక్వీ అన్నారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన హస్తకళల ప్రదర్శన హునార్ హాట్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమై సీఎఎ , ఎన్ఆర్ సీ ,ఎన్ పీ ఆర్  పట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని,  అలాగే దేశంలోని ఒక వర్గంలో భయాందోళనలు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ చట్టం వల్ల ముస్లింలకు నష్టం కలిగే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్లుగా తమ, తమ రాష్ట్రాలలో సీఏఏ కు విరుద్ధంగా చట్టాలను చేస్తామని కొందరు ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, అలా చేయటం రాజ్యాంగ విరుధ్ధమని అన్నారు. సి ఎ ఎ అమలు వల్ల వారి పౌరసత్వాని  కి ఎలాంటి విఘాతం కలగదని మంత్రి పేర్కొన్నారు.

Related posts

వ్యాయామ ఉపాధ్యాయుడు డా. మోహన్ కు మరో అంతర్జాతీయ పురస్కారం

Satyam NEWS

అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు

Sub Editor

నారాయణ పరివారానికి ముందస్తు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment