రాజ్యాంగం అనేది పవిత్ర గ్రంథం. దానిని ఉల్లంఘించిన వారెవరైనా పతనం తప్పదు. ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతికేహక్కు ప్రతి భారతీయులకు ఉంది. మోడీ, అమితాషా ల జంట దేశానికి అభద్రతను కల్పిస్తుంది అని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. వ్యక్తుల జాతులను ప్రశ్నించే హక్కు రాజ్యాంగంలో ఎవరికి లేదని ఆయన అన్నారు.
CAA, NRC, NPR చట్టాలను వ్యతిరేకిస్తూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ మోడీ, అమితాషా ల జంట రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని అన్నారు. ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగానికి బద్ధుడుగా ఉండాలని, భారత రాజ్యాంగమే మనకు భగవద్గీత, బైబుల్, ఖురాన్ గా భావించాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ సభ లో ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తీ కూడా నేను భారతీయుడని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం CAA, NRC, NPR చట్టానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం కూడా పాల్గొన్నారు.