28.7 C
Hyderabad
April 20, 2024 07: 56 AM
Slider హైదరాబాద్

అన్ని క్యాబ్ లకు 100 ఫోన్ తో అనుసంధానం

city police

హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గురువారం కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌తో కలిసి క్యాబ్ సర్వీస్ నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం క్యాబ్ నిర్వాహకులు డయల్ 100కు కాల్స్ అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యాబ్‌లలో మహిళల భద్రత కోసం ఉన్న యాప్‌లను డిస్‌ప్లే చేసేలా చూడాలన్నారు. ప్రతి రెండుమూడు రోజులకు ఒకసారి డ్రైవర్ల ప్రవర్తనపై కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు.

 నగరంలోని క్యాబ్ డ్రైవర్ల తీరుపై కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడతామని ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. 15 క్యాబ్ సర్వీస్ సంస్థలతో పాటు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్‌కుమార్, బాబురావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

జస్టిస్ పై జగన్ ఆరోపణల విచారణకు సుప్రీం రెడీ

Satyam NEWS

బలవంతపు వసూలు చేస్తున్న తై బజార్ గుత్తేదారులు

Satyam NEWS

ఘనంగా భద్రాచలం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం

Satyam NEWS

Leave a Comment