36.2 C
Hyderabad
April 24, 2024 19: 53 PM
Slider ఆదిలాబాద్

Calamity: ప్రకృతి ప్రాణాలు తోడేస్తున్న ఇసుక దొంగలు

#Sand Mafia

కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలో అడ్డు అదుపు లేకుండా ఇసుకను తోడేస్తున్నారు, ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సంబంధం లేకుండా తమ అక్రమ వ్యాపారాలు యదేచ్ఛగా సాగిస్తున్నారు. పెంచికల్పేట, చెడువాయి, లోడ్పెళ్లి మరియు కొండపల్లి ప్రాంతంలో ఇసుకను యదేచ్ఛగా పట్టపగలే తవ్వేస్తున్నారు.

అక్రమంగా సహజ సంపదను కొల్లగొట్టేస్తున్నారు. వాగులను వంకలను బొందల గడ్డ తయారు చేస్తున్నారు దీనివల్ల పర్యావరణానికి భూగర్భ జలాలు అడుగంటి పోవడం తెలిసి కూడా అక్రమ సంపాదన కోసం తెగిస్తున్నారు . అధికార పార్టీ నాయకులే ఈ దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.

ఎందుకంటే అధికార పార్టీ నాయకుల హస్తం లేకుండా ఇసుక దందా చేయలేరని జగమెరిగిన సత్యం. రెవెన్యూ శాఖ కూడా చూసి చూడనట్టు గానే వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు ఒకవేళ ట్రాక్టర్లను సీజ్ చేస్తే అధికార పార్టీ నుండి ఏ తల నొప్పులు వస్తాయి అని భయపడుతున్నారు. ఇసుక తరలించేటప్పుడు పట్టుబడితే కూలీలు వాళ్ల నాయకుల పేర్లు చెప్పడం  బారి తెగింపుకు నిదర్శనం ఇప్పటికైనా పెంచికల్పేట్ మండలంలో ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి సహజ సంపదను కాపాడాలని ఇసుక దందా చేస్తున్న నాయకుల్ని అక్రమార్కులు ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు పౌరహక్కుల ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts

పోలవరం పూర్తి కావడం కష్టo

Murali Krishna

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

భారత్ జోడో యాత్రకు ఆరేళ్ల ఆర్యమాన్ మద్దతు

Bhavani

Leave a Comment