34.2 C
Hyderabad
April 19, 2024 18: 59 PM
Slider విజయనగరం

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అండ‌గా కాల్ సెంట‌ర్‌

#callcenter

ఆప‌త్కాలంలో అండ‌గా ఉండి, ఆదుకుంటోంది కాల్ సెంట‌ర్‌. ఈ కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి, ఆసుప్ర‌తుల్లో ప‌డ‌క‌లు నుంచి, ప‌రీక్ష‌లు, వాటి ఫ‌లితాలు, కోవిడ్ కు సంభంధించిన ఇత‌ర స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. కోవిడ్ క‌ష్ట‌కాలంలో స‌హాయ‌ప‌డేందుకు రాష్ట్ర‌స్థాయిలో 104 కాల్ సెంట‌ర్ ప‌నిచేస్తుండ‌గా, విజయ నగరం జిల్లాలో 12 లేండ్‌లైన్ నంబ‌ర్ల‌తో ఒక ప్ర‌త్యేక విభాగం 24 గంట‌లూ సేవ‌లందిస్తోంది. క‌లెక్ట‌రేట్లోని క‌మాండ్ కంట్రోల్ రూము కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ కాల్ సెంట‌ర్ల‌కు ఇప్ప‌టివర‌కూ 4,668 మంది ఫోన్లు చేసి, స‌హాయాన్ని పొందారు.క‌రోనా రెండో ద‌శ మొద‌ల‌వ్వ‌గానే ప్ర‌భుత్వం 104 కాల్ సెంట‌ర్ ను రాష్ట్ర‌స్థాయిలో మరింత బ‌లోపేతం చేసి, అద‌నంగా వైద్యుల‌ను, ఇత‌ర సిబ్బందిని నియ‌మించింది. అలాగే ఈ మేర‌కు జిల్లా స్థాయిలో 12  లేండ్‌లైన్ నంబ‌ర్ల‌తో ఒక ప్ర‌త్యేక విభాగాన్ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు డుమా ఏపిడి బి.సుధాక‌రరావు ను నోడ‌ల్ ఆఫీస‌ర్‌ను నియ‌మించారు. వీరి ఆధ్వ‌ర్యంలో మూడు షిప్టుల్లో ముగ్గురు వైద్యాధికారులు, షిప్ట్‌కు ప‌దిమంది చొప్ప‌న కాల్ సెంట‌ర్ సిబ్బంది ప‌నిచేస్తున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ కాల్ సెంట‌ర్ సేవ‌ల‌ను నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కాల్ సెంట‌ర్‌కు 4,668 ఫోన్లు…!

విజయనగరం జిల్లాకు సంబంధించి కాల్ సెంట‌ర్ల‌కు  ఇప్ప‌టివ‌ర‌కు 4,668 మంది ఫోన్ చేసి స‌హాయం పొందారు. త‌మ‌కు క‌రోనా ఆసుప‌త్రిలో బెడ్ కావాల‌ని బాదితులు ఫోన్ చేసారు. అలాగే  ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాల‌ని మ‌రి కొంద‌రు కోరారు. ఇక  శ్వాస ఆడ‌టం లేద‌ని, ఆక్సీజ‌న్, వెంటిలేట‌ర్ కావాల‌ని, త‌మ‌కు క‌రోనా ప‌రీక్ష చేయించాల‌ని కోరారు. దీంతో పాటు ఆక్సిజ‌న్ పొందుతున్న వారి  ఫ‌లితాన్ని చెప్పాల‌ని, త‌మ‌కు పాజిటివ్ వ‌చ్చిన కార‌ణంగా, కుటుంబ స‌భ్యులు స‌రిగ్గా చూడ‌టం లేద‌ని ఇంకొంద‌రు కోరారు. అలాగే కరోనాకు సంబంధించిన ఇత‌ర స‌మాచారం కోసం 104తో బాటు జిల్లా కాల్ సెంట‌ర్‌కు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇలా కాల్ సెంట‌ర్ల‌కు ఫోన్ చేసిన 1148 మందికి ఇప్ప‌టివ‌ర‌కూ ఆసుప‌త్రుల్లో బెడ్స్ కేటాయించడం జ‌రిగింద‌ని జిల్లా స‌మాచారం కేంద్రం తెలిపింది.

గ‌త వారం లోజులుగా కాల్‌సెంట‌ర్‌కు వ‌చ్చిన కాల్స్….!

ఇక జిల్లా స‌మాచారం కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన కాల్ సెంట‌ర్ ద్వారా… ఈ నెల 2  నుంచీ ఎన్నికాల్స్ వ‌చ్చాయో తెలిపింది. ఇందులో భాగంగా. ఈ నెల   02వ తేదీన 55 ఫోన్‌ కాల్స్‌, 03 వ తేదీన‌ 107 కాల్స్‌, 04వ తేదీన 49 కాల్స్‌, 5 తేదీన 92 కాల్స్‌, 6న 13 కాల్స్‌, 7వ తేదీన 46 కాల్స్‌, 8వ తేదీ న 77 కాల్స్‌, 9న 98 కాల్స్ వ‌చ్చాయి.

వ‌చ్చిన కాల్స్  వారి సంఖ్య

ఫోన్ చేసిన‌వారు -4,668

ఆసుప‌త్రిలో చేర్చాల‌ని- 1148

కోవిడ్ టెస్టుల కోసం- 1195

టెస్టు ఫ‌లితాల కోసం- 1530

కుటుంబ స‌భ్యులు పట్టించుకోవడ లేదంటూ-108

కరోనా కు సంబంధించిన స‌మాచారం కోసం- 2,217

ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రిస్తూ- 32

టెలీమెడిసిన్ సేవ‌ల‌కోసం- 35

108 అంబులెన్స్ సేవ ల‌కోసం.16 మంది పోన్ చేసి స‌హాయంతో పాటు సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

కాల్ సెంట‌ర్ ఎలా ప‌నిచేస్తుందంటే….?

రాష్ట్ర‌స్థాయిలో ప‌నిచేసే 104 కాల్ సెంట‌ర్‌కు క‌రోనా పేషెంట్ గానీ, అత‌ని బంధువులు గానీ ఫోన్ చేయ‌గానే, కాల్ సెంట‌ర్ సిబ్బంది సంబంధిత వైద్యునితో మాట్లాడిస్తారు. అలాగే అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుడు అంచ‌నా వేసి, అత‌న్ని హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంచాలా, కోవిడ్ కేర్ సెంట‌ర్‌కు త‌ర‌లించాలా, లేదా ఆసుప‌త్రిలో చేర్చాలో నిర్ణ‌యిస్తారు. వెంట‌నే అడ్మిష‌న్ టిక్కెట్ కేటాయించి, సంబంధిత జిల్లాకు ఆన్‌లైన్లో పంపిస్తారు. ఈ టిక్కెట్ చూసిన వెంట‌నే జిల్లాలో ఉండే కాల్‌సెంట‌ర్ సిబ్బంది, సంబంధిత పేషెంట్‌తో మాట్లాడి, ప‌డ‌క‌ల ల‌భ్య‌త‌ను బ‌ట్టి, వారికి ద‌గ్గ‌ర‌లో ఉన్న కేర్ సెంట‌ర్‌కు లేదా ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. సంబంధిత ఆసుప‌త్రి నోడ‌ల్ అధికారితో కూడా మాట్లాడి, పేషెంట్‌ను పంపిస్తున్న‌ట్లు స‌మాచారాన్ని ఇస్తారు. ఇదే స‌మ‌యంలో 108కు కూడా స‌మాచారాన్ని ఇచ్చి, వాహ‌నం వారింటికి స‌కాలంలో చేరేలా చూస్తారు. జిల్లా స్థాయి నెంబ‌ర్ల‌కు ఫోన్ చేస్తే, నేరుగా జిల్లాలోని మెడిక‌ల్ ఆఫీస‌రే పేషెంట్‌తో మాట్లాడి, త‌గిన నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. ఆందోళ‌న చెందుతున్న పేషెంట్‌కు కౌన్సిలింగ్ చేస్తారు.ఇక  కాల్ సెంట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణాధికారులైన నోడ‌ల్ ఆఫీస‌ర్- బి.సుధాక‌ర‌రావు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు- డాక్ట‌ర్ ఏ.ఆనంద్‌, డాక్ట‌ర్ వైష్ణ‌వి అఖండ‌, డాక్ట‌ర్ అంబేద్క‌ర్ ల‌ను జిల్లా యంత్రాంగం నియ‌మించింది.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

హోం మంత్రి మహమూద్ అలీకి పాజిటీవ్

Satyam NEWS

పురుగుల మందు డబ్బాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

అభివృద్ధి పథంలో హుజుర్ నగర్ నియోజకవర్గం

Satyam NEWS

Leave a Comment