ఆలయ ఇఓ కృష్ణవేణి కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తుందా ? ఇది నిజమా ,భక్తులకు సౌకార్యాలు కల్పించడంలో ఆమె విఫలం అవుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావాలని చూస్తుందని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అబియోగంమోపుతున్నాడు. కావాలంటే ఈ మెమో చూడండి.
లక్షలాది మంది భక్తులు వేములవాడకు విచ్చేస్తుంటే రోడ్డుపై ఎక్కడి కక్కడే చెత్త పేరుకుపోయి ఉండటం , క్యూ లైన్ లో సరిగా భక్తులకు సౌకర్యాలు లేకపోవడం,వారికి తాగు నీటి వసతి కల్పించక పోవడం లాంటి మీరు చేస్తున్నతప్పిదాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయని కలెక్టర్ కృష్ణ భాస్కర్ వేములవాడ రాజన్న ఆలయ ఈ.ఓ కృష్ణవేణికి మెమో జారీ చేశారు.కానీ చిన్న జిల్లా రాజన్న సిరిసిల్ల లో తమరు కూడా ఈ భక్తుల రద్దీని చూసి చూడనట్లు వదిలేశారు కదా తమరికి ఎవరు ఇవ్వాలి మెమో అని ఇక్కడి అధికారులు ప్రజలు ప్రశ్నిస్తూన్నారు.
ఈ.ఓ కలెక్టర్ ను పట్టించు కోలేదా ?
భక్తుల లోకల్ నాయకుల ఫిర్యాదుకు స్పందించి తానూ తనిఖీకి వస్తున్నానని చెప్పినప్పటికీ ఈ.ఓ తానూ విసిట్ చేసున్నా తనను పట్టించుకోలేదని స్వయం గా మెమో లో తెలపడం గమనార్హం.అయితే లక్ష మందికి ఫై గా జనం దేవాలయం లో కిక్కిరిసి ఉండగా కలెక్టర్ తనిఖీ లు చేస్తున్నారని అయన వెంట తిరగడం కంటే భక్తులకు దర్శనం సాఫి గా జరగాలని క్యూ లైన్ లను సర్దుతున్న ఈ.ఓ పై కలెక్టర్ తనను పట్టించు కోలేదని ఆగ్రహం తో ఉన్నారని దేవాలయ ఉద్యోగులు కొందరు వ్యాఖ్యానించారు.ఐతే భక్తులకు ఏర్పాట్లు చూస్తున్న ఈఓ కలెక్టర్ కంటే భక్తులకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.