37.2 C
Hyderabad
March 28, 2024 18: 14 PM
Slider నల్గొండ

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించిన వైద్య బృందం

#Hujurnagar Medicals

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లోని దద్దనాలచెరువు కాలనీలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన  కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సూచించారు.

సీజన్లో సంభవించే మలేరియా,  చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు నీటి నిల్వ కేంద్రాలలో దోమలు పెరగటం వల్ల వచ్చే అవకాశం ఉందని, మురుగు నీరు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని సూచించారు.

కరోనా వ్యాధి ప్రబలకుండా వ్యక్తిగత దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపరచుకోవడం వంటివి తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల  రామకృష్ణ ఉదయగిరి శ్రీనివాస్, ఆర్ మాధవి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కామారెడ్డిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో సంబరాలు

Satyam NEWS

గేదెపై దాడి చేసిన బెంగాల్ టైగర్

Satyam NEWS

ఆత్మహత్యాయత్నానికి గురైన దళిత విలేఖరికి దక్కని న్యాయం

Satyam NEWS

Leave a Comment