27.7 C
Hyderabad
April 18, 2024 07: 23 AM
Slider ఆంధ్రప్రదేశ్

నెవర్ కంప్రమైస్:ఆంధ్రలో తిరగాలంటే వీసా కావాలా

can tdp cadre get visa to move in andhra chandrababu questioned

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తిరుగాలంటే వీసా కావాలా అని ఇదేమైనా పాకిస్థానా అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పక్క జిల్లాకు చెందిన తెదేపా నేతలు మాచర్ల వెళ్లారంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అంటూ అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడ అవినీతి జరుగుతుందని నామినేషన్లను అడ్డుకుంటున్నారని తెలిసి టీడీపీ పార్టీ తరుపున నిజ నిర్ధారణ కమిటీ ని పంపించామని వారిపైవైకాపా గుండాలు దాడికి పాల్పడుతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ సబ్యులకు అన్ని ప్రాంతాలలో తిరిగే స్వేచ్ఛ ఉందని అయన తెలుపుతూ వైకాపా గుండా ఇజం చేస్తుందని ఇటువంటి గుండాలను తానూ 40 ఎల్లా రాజకీయ జీవితం లో చాలా మందిని చూసాననని వైఎస్సార్ తో సహా అనేక మంది గుండాలు రౌడీలు తనను బెదిరింఛాలని చూసిన తానూ ఎవరికీ భయపడ లేదని అయన తెలిపారు.


రాష్ట్రంలో అడుగడుగునా స్థానిక ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. అధికార పార్టీ నేతలతో పాటు పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.

తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 12 చోట్ల తెదేపా జడ్పీటీసీ అభ్యర్థులు, 577 చోట్ల తెదేపా ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైకాపా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో మళ్లీ రీ-నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు.

Related posts

నామినేషన్ వేయడానికి ముందే బెయిల్ రద్దు అవుతుందా…?

Satyam NEWS

ప్రజా రవాణా శాఖ కు ఆర్టీసీ సిబ్బంది

Satyam NEWS

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

Satyam NEWS

Leave a Comment