కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని లిబరల్ పార్టీ అధ్యక్షుడిని కోరినట్లు ట్రూడో చెప్పారు. ట్రూడో నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని తట్టుకోలేకపోయాడు. గత ఏడాది చివర్లో ఆయన మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి ఆకస్మిక నిష్క్రమణ ఆయన ప్రభుత్వంలో పెరుగుతున్న గందరగోళాన్ని సూచించింది. మార్చి 24 వరకు పార్లమెంట్ సస్పెండ్ చేస్తారు. జనవరి 27న ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమయం లిబరల్ పార్టీ అంతర్గతంగా నాయకత్వ పోటీని అనుమతిస్తుంది. ఈ పోటీలో నెగ్గిన వారు ప్రధాన మంత్రి అభ్యర్ధిగా మారతారు.
previous post
next post