38.2 C
Hyderabad
April 25, 2024 14: 21 PM
Slider ముఖ్యంశాలు

టెన్త్ విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు

#navataramparty

కరోనా సెకండ్ వేవ్ తో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు పోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.

పదోతరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలని, మొత్తం విద్యార్థులను పాస్ చేయాలని ఆయన కోరారు.

ఉపాధ్యాయులు కరోనా బారిన పడితే క్యాజువల్ లీవ్ క్రింద పరిగణించడం సరికాదని కరోనా వచ్చిన వారికి ప్రత్యేక సెలవులు15 రోజులు ఇవ్వాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.

కరోనా వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

అయితే ఇంటింటికీ వెళ్లి వాక్సినేషన్ చేయడానికి సన్నాహాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

(Free Sample) < Maple Valley Hemp Cbd Oil Ra Hemp Cbd Potent Green Dragon Tincture Why Use Cbd Hemp Oil

Bhavani

కార్డెన్ సెర్చ్

Murali Krishna

లవ్ ఎఫైర్:ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇద్దరి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment