Slider కృష్ణ

కరెంటు చార్జీలు పెంచడం కాదు బిల్లులే రద్దు చేయాలి

#TDP Nandigama

లాక్ డౌన్ పీరియడ్ లో కరెంట్ బిల్లులు రద్దు చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా నందిగామ నియోజక వర్గం నందిగామ మండల తెలుగుదేశం పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి సజ్జా అజయ్ నిరసన దీక్ష చేశారు. ఆయనతో బాటు టీ.ఎన్. ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి కొంగర నరేంద్రనాథ్, చందాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు కొంగర సత్యనారాయణ , పార్టీ సీనియర్ నాయకులు మన్నెం వేణు, పెసరమల్లి రాంబాబు, నల్లమోతు వేణు కూడా దీక్షలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు చర్యలకు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే కరెంటు చార్జీలను తగ్గించాలని పాత శ్లాబు విధానమే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో విపరీతంగా కరెంటు చార్జీలు పెంచడం సరికాదన్నారు. విద్యుత్ బిల్లులు రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఇంకో రాజాసింగ్ కావాలి

Satyam NEWS

మెట్రో రైల్ ప్రయాణీకులకు మాస్కుల పంపిణీ

Satyam NEWS

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment