28.2 C
Hyderabad
April 20, 2024 12: 16 PM
Slider కృష్ణ

విజయవాడలో క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం

#CancerAwarenessRally

ఒకప్పుడు క్యాన్సర్ అనేది వైద్యం లేని వ్యాధి కాగా ఇప్పుడు అవసరమైన చికిత్సా విధానాలు ఉన్నాయని అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు.

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘I am and i will’ నినాదంతో విజయవాడ నగరంలో  క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో లక్షణాలను గుర్తిస్తే కాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు.

ఎస్పీ రాధికా మాట్లాడుతూ వరల్డ్ కాన్సర్ డేగా ఈ రోజును ఎన్నో దేశాలు జరుపుకుంటున్నారని తెలిపారు. క్యాన్సర్ బారిన పడి ఇండియాలో ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారని, వచ్చిన సర్వే ప్రకారం 15మందిలో ఒకరు చనిపోతున్నారని అన్నారు.

మెడికల్ ఆంకాలజిస్ట్ రాజేష్ కోట మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న అపోహలని తొలగించడానికి, ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కాన్సర్ డే జరుపుకుంటామన్నారు. మహిళలో వచ్చే బ్రేస్ట్, గర్భాశయ  కాన్సర్‌ని తొలి దశలో గుర్తించాలని చెప్పారు. పురుషుల్లో వచ్చే నోటి, ఊపిరితిత్తులు, లివర్ క్యాన్సర్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

Related posts

ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?

Satyam NEWS

కంకిపాడులో చైతన్య విద్యాసంస్థల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

Satyam NEWS

కన్నా, కరోనా, లాక్ డౌన్: ఛీ ఛీ ఇదేం బీజేపీ?

Satyam NEWS

Leave a Comment