28.7 C
Hyderabad
April 25, 2024 03: 38 AM
Slider ముఖ్యంశాలు

మాట తప్పి మడమ తిప్పిన సిఎం జగన్

lokesh 24

అధికారం ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో తప్పుడు హామీలిచ్చినెరవేర్చలేక పాలన చేతకాక ప్రతీ హామీపై మాట తప్పుతున్న సీఎం జగన్, చివరికి అమరావతి రాజధానిపైనా మడమ తిప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.

తన పార్టీ మేనిఫెస్టోలో కూడా రాజధానిగా అమరావతి ఉంటుందని పేర్కొన్న జగన్, ప్రతిపక్ష నేతగా కూడా అమరావతి రాజధానికి జై కొట్టి నేడు మాట మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి ప్రాంతీయులు, రైతులు, రైతు కూలీల ఆధ్వర్యంలో మంగళవారం ఎంఎస్ఎస్ భవన్ నుంచి ప్రారంభమైన కాగడాల ర్యాలీలో నారా లోకేశ్ పాల్గొన్నారు.

బస్టాండు సెంటర్ పాత బస్టాండ్ సెంటర్ నుంచి చినపంజా వీధి మీదుగా మెయిన్ బజార్ దేవస్థానం రోడ్డు అంబేద్కర్ సెంటర్ వరకూ ర్యాలీ కొనసాగింది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు, డౌన్ డౌన్ సీఎం అంటూ నిరసనకారులు నినదించారు. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని పేర్కొని విశాఖ పారిపోతున్నావెందుకు? అని లోకేష్ ప్రశ్నించారు.

అక్కడ మీరు ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారా? అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు దమ్ముంటే న్యాయవిచారణకు ఆదేశించి విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి, చేసిన ఆరోపణలపై ఎందుకు విచారణకు ఆదేశించలేక పోతున్నారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం విభజించు పాలించు సూత్రంతో ఇటువంటి కుట్రలకు సీఎం జగన్ తెరలేపారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తుందని, వేలాది మంది రైతుల త్యాగాలతో రూపుదిద్దుకున్న అమరావతిని పాలనా వికేంద్రీకరణ పేరుతోని తరలించే కుట్రలను వ్యతిరేకిస్తోందన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు  ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టనని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచే ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 

ఇవాళ అమరావతి కి జరిగే అన్యాయం రేపు అన్ని జిల్లాలకు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడపాలనే జగన్ ఎత్తుగడని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పెట్టుబడులన్నీ తరలిపోతున్నా పాలకుల్లో కనీస స్పందనలేదన్నారు. అమరావతి రైతులు, కూలీలు ఆందోళనలను పాలకులు హేళన చేస్తుండటం వారి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 

రాజధాని ప్రాంత వైకాపా నేతలు ఎందుకు రైతులు గోడు వినేందుకు రావట్లేదని ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ ఓ బోగస్ కమిటీ అని ఆరోపించారు. 3ముక్కలు గా రాష్ట్రాన్ని విడకొట్టి బిస్కెట్ విసిరినట్లు విసిరితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత గ్రామాల  ప్రజలు ఐక్యం గా ఉంటే ఎవ్వరేం చేయలేరని భరోసానిచ్చారు.

రాజధాని ప్రాంతీయులు, రైతులు, రైతు కూలీలకు న్యాయం జరిగేవరకూ తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాడుతుందని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ నేతలు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్ధయ్య, ఆకుల జయసత్య, కొల్లి శివరామిరెడ్డి, తోట పార్థసారధి, దొప్పలపూడి జ్యోతి బసు, కొమ్మారెడ్డి కిరణ్, జంగాల సాంబశివరావు, వెలగపాటి విలియమ్స్, సంకా బాలాజీ గుప్తా, కాలేషా, గాదె పిచ్చిరెడ్డి, వల్లూరు సూరిబాబు, మాదల రమేష్, జవ్వాది చందు, ఎండీ ఇబ్రహీం, నాయకులు పాల్గొన్నారు.

Related posts

షూటింగ్ లో జాతీయ పోటీలకు ఎంపికైన బిసి గురుకుల స్కూల్ విద్యార్థి మౌనిక

Bhavani

పూర్ణాహుతితో ముగిసిన భవానీ మండల దీక్షలు

Satyam NEWS

ప్ర‌జా స‌మ‌స్య‌లకు అత్యున్న‌త‌ స్థాయిలో ప‌రిష్కారం

Satyam NEWS

Leave a Comment