29.2 C
Hyderabad
October 10, 2024 19: 28 PM
Slider మహబూబ్ నగర్

సంతాపం: జన నాయకుడికి అశ్రునివాళి

candle light rally

వేలాది మంది ప్రజల గుండెలో గుడు కట్టుకొని ఉన్న గాదెల రత్న ప్రభాకర్ రెడ్డికి కొల్లాపూర్ ప్రజలు ఘన నివాళి అర్పించారు. రోడ్డు ప్రమాదానికి గురై అకాల మరణానికి గురైన టిఆర్ఎస్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గ ముఖ్యనాయకులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జి. సుధారాణి భర్త గాదెల రత్న ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన ముఖ్య అనుచరులు కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు.

ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్థలో సాయంత్రం 6గంటల సమయంలో కీర్తిశేషులు రత్న ప్రభాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ కాటమ్ జంబులయ్యా, ఎమ్మెల్యే  వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్ర ఆకాంక్షించారు.

మరీ ముఖ్యంగా స్వర్గస్తులు గాదెల రత్న ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరవర్గం అయిన వంగ రాజశేఖర్ గౌడ్, రఘుపతి, నాగేందర్ యాదవ్, రమేష్ గౌడ్, నాగరాజు, శేఖర్ గౌడ్, వైస్ ఎంపిపి భోజ్య నాయక్, మండల నాయకులు ముచ్చర్ల రామచంద్ర యాదవ్, వేణుగోపాల్ యాదవ్, ఎంపిటిసి బిచ్చాయ్య, అజ్మద్దిన్ పట్టణ పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు వెలిగించి పట్టుకుని నివాళి అర్పించారు. జోహార్ రత్న ప్రభాకర్ రెడ్డి, రత్న ప్రభాకర్ రెడ్డి అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలోఎంపిటిసి, సర్పంచ్ లు పాండు నాయక్, ముక్కిడిగుండం సర్పంచ్ దశరథం నాయక్, సర్పంచ్ శంకర్ నాయక్, అమరగిరి సర్పంచ్ శంకర్ నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.

వీరే కాకుండా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ నాయక్, కార్నె  వాసు, రాము, అజ్మాద్ధిన్, కిరణ్, చంద్ర శేఖర చారి, రాము, బేకరీ ఖాదర్, కరీం, హరిసురేశ్, కేశావులు, ఎం స్వామి, శివ, బాలు, బంకల వెంకటస్వామి, కలమంద శేఖర్, జగదీష్ గౌడ్ తదితరులు కూడా నివాళి అర్పించారు.

Related posts

అంబర్ పేట ఇన్స్సెక్టర్ పై కేసు నమోదు

Bhavani

సీఎం కేసీఆర్ రైతు ద్రోహి

Bhavani

భూ తగాదాలు, సెటిల్ మెంట్లలో పోలీసులు జోక్యం చేసుకోవద్దు

Satyam NEWS

Leave a Comment