36.2 C
Hyderabad
April 25, 2024 19: 48 PM
Slider కడప

భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రాజధాని మార్పు

#BatyalaChangalraidu

రాజధాని మార్పు భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే తప్ప అభివృద్ధి కోసం కాదని కడప జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు అన్నారు.

అమరావతిని క్యాపిటల్ గానే ఉంచుతాం, రాజధాని మార్చే ప్రసక్తే లేదు, అందుకే మా నాయకుడు సొంత నివాసం, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం అన్నీ ఇక్కడే నిర్మించుకుంటున్నారు అని ఎన్నికలకు ముందు చెప్పిన వైసిపి నాయకులు ఆ తర్వాత ప్రజల్ని దారుణంగా మోసం చేశారని ఆయన అన్నారు.

ఇంత కన్నా తుగ్లక్ చర్య ఇంకొకటి ఉంటుందా?

వెనుకబడిన సౌత్ ఆఫ్రికా ను మీరు మోడల్ గా తీసుకొని దానికి 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి, ఏపీ కూడ 3 రాజధానులు అనడం కన్నా తుగ్లక్ చర్య ఇంకొకటి ఉందా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వైకాపా బెదిరింపులతో ఏడాది కాలంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని, మీరు రాష్ట్రంలో గౌరవ పదవిలో ఉండి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మూటకట్టుకుని కూడా చేసే ప్రతి తప్పుని దాచి పెడుతూ రాష్ట్రాన్ని అడ్డదారిలో నడిపించడం భావ్యం కాదని ఆయన ముఖ్యమంత్రి కి హితవు పలికారు.

ప్రజలు దీన్ని సమ్మతించరని ఎన్నికలో మేనిఫెస్టో అంటే భగవద్గీత ఖురాన్ బైబిల్ అని నోటితో చెప్పడం కాదు, ఆచరణలో కూడా చూపించాలని ఆ గౌరవం మేనిఫెస్టో పట్ల ప్రజల పట్ల ఉండాలని బత్యాల అన్నారు. రాజధాని మూడు ముక్కలు చేయాలన్న మీ నిర్ణయానికి ప్రజా ఆమోదం మళ్లీ కోరాలని ఆయన డిమాండ్ చేశారు.

అన్ని జిల్లాలను డెవలప్ చేసిన వ్యక్తి చంద్రబాబు

మీరు తీసుకున్న నిర్ణయంపై మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం రండి అని వైసీపీ వారిపై రాజంపేట నియోజకవర్గ ప్రజల తరపున బత్యాల సవాల్ చేశారు.

టిడిపి హయాంలో చంద్రబాబు13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి పాటుపడ్డారని, దేశంలోనే విశాఖపట్నాన్ని ప్రధాన నగరంగా తీర్చిదిద్దారని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచడమే కాకుండా ఐటీ, ఫార్మ్ హబ్ గా కూడా మార్చారని, రాష్ట్రంలో అన్ని జిల్లాలను ఇదే అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని తెలిపారు.

Related posts

నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి : డిఐజి ఏ.వి. రంగనాధ్

Satyam NEWS

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

Satyam NEWS

వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ

Satyam NEWS

Leave a Comment