బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మరోసారి రాయలసీమకు రాజధాని ఇవ్వాలన్న డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ లాగే ఏపీకి కూడా రెండు రాజధానులు ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు కారణంగా రాయలసీమకు రూ.50 కోట్ల మేర ఉపాధి నిధులు రాలేదని, సీమకు ఆగిపోయిన నిధులను ప్రస్తుత ప్రభుత్వం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిధులను ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
previous post