39.2 C
Hyderabad
March 29, 2024 13: 48 PM
Slider కరీంనగర్

ఈటలకు పోటీగా హుజూరాబాద్ లో ఇక ‘కెప్టెన్’ నాయకత్వం

#captainLaxmikantarao

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గ సమన్వయ కర్తగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్  లక్ష్మీకాంతరావు ను నియమించారు.

ఈటల రాజేందర్ వైపు టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లకుండా చూసేందుకు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు.

మొదటి నుంచి కెప్టెన్ హుజూరాబాద్ నియోజకవర్గం లో తెరాస బాధ్యతలను చూసుకున్నారు.

అయితే డీ లిమిటేషన్ పుణ్యమా అని  కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కనుమరుగు కావడంతో అప్పటి వరకు కమలా పూర్ ఎమ్మెల్యే గా ఉన్న ఈటెల రాజేందర్ ను ను హుజూరాబాద్ కు మార్చి కెప్టెన్ కుమారుడు సతీష్ బాబు ను పక్కనే ఉన్న హుస్నాబాద్ కు కేసీఆర్ మార్చిన విషయం విదితమే.

అనంతరం అప్పటి వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన కెప్టెన్ ను రాజ్యసభ సభ్యులుగా చేశారు. హుజూరాబాద్ లో కెప్టెన్ అప్పటికే తెరాస ను బలోపేతం చేశారు.

తెరాస కు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ ను విడిచిపెట్టడం కెప్టెన్ కు ఇష్టం లేకున్నా అప్పటి రాజకీయ పరిణామాల వల్ల విడిచిపెట్టారు.

అప్పటి కెప్టెన్ అనుచరులే నేటి ఈటెల అనుచరులుగా మారారు. అప్పటి నుండి నేటి వరకు హుజూరాబాద్ లో తెరాస కు తిరుగు లేకుండా పోయింది.

అప్పటి నుండి కొంత కాలం పాటు రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువురు పోరాడినా కెప్టెన్, సతీష్ బాబు లు తర్వాత కాలంలో హుస్నాబాద్ కే పరిమితం అయ్యారు.

హుజూరాబాద్ నియోజక వర్గo లోని  కార్యకర్తలు కెప్టెన్ కుటుంబాన్ని మరిచిపోకుండా గతంలో వారు కార్యకర్తలకు చేసిన సేవలు చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాస కార్య కర్తలను, క్యాడర్ ను కాపాడుకోవాలంటే ఒక్క కెప్టెన్ తప్ప ఎవరూ సరిపోరని భావించిన కెసిఆర్, కెప్టెన్ తో నేరుగా మాట్లాడి రంగం లోకి దించినట్లు తెలిసింది.

హుజూరాబాద్ లో ఈటెల ను ఒంటరి చేయాలంటే జిల్లా నుంచి మంత్రులు పోయి కార్యకర్తలతో మాట్లాడి రి డైరెక్ట్ చేసే వరకు పుణ్య కాలం కాస్తా గడుస్తుంది అని భావించిన కెసిఆర్ కెప్టెన్ ను ఇక్కడికి రావడం ఇష్టం లేకున్నా ఒప్పించి క్యాడర్ ను కాపాడుకోవాలని పంపినట్లు తెలిసింది.

కార్యకర్తలు ఎవరూ ఈటెల వైపు వెళ్ళ కూడదంటే వారికి అండగా ఓ నాయకుడు కనబడాలని, ఇందులో భాగంగానే కెప్టెన్ కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది.

మామిడి రవీందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

కార్మికుల కోసం సిఐటియు చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి

Satyam NEWS

ఎక్స్పెక్టెడ్:బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం

Satyam NEWS

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment