చేపలు కొందామని ఆగిన ఆ దంపతులు కారు వెనక్కి తీసుకోవడం లో విఫలమవడం తో తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ వద్ద కాకతీయ కాలువలో కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. కాకతీయ కెనాల్ లో పడ్డ మృతులు మాచర్ల శ్రీనివాస్ స్వరూపగా పోలీసులు గుర్తించారు.
సుల్తానాబాద్ లో బట్టల వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ దంపతులు హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వస్తూ కాకతీయ కెనాల్ వద్ద చేపల కొనుగోలుపై ఆగి, కారు వెనక్కి తీస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చూసినవారు చెప్పారని ఏసీపీ విజయ సారథి తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ కారును వెనక్కి తీస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. స్థానిక యువకులు గజ ఈతగాళ్లు భారీ క్రేన్ సహాయంతో కారును బయటకి లాగారు. డెడ్ బాడీ లను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు కాసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.