వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వర రావు, వనపర్తి సీఐ ఎం. క్రిష్ణ మొత్తం 80 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వనపర్తి రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని జంగాలగుట్ట, బుడగ జంగాల కాలనీలలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా సుమారు 250 ఇళ్లను సోదాలు చేశారు. పత్రాలు సరిగా లేని, నెంబర్ ప్లేట్ లేని కార్లు,ఆటో, 25 ద్విచక్రవాహనాలు మొత్తం30 వాహనాలు అదుపులోకి తీసుకొని సీజ్ చేసి వనపర్తి రూరల్ పోలీస్టేషన్ కు తీసుకువెళ్లారు.
సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా, గుడుంబా తయారీ, గంజాయిని విక్రహిచడం, పీడీస్ రైస్ అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గుడుంబా,గుట్కా,గంజాయి లాంటి అక్రమ వ్యాపారం, చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడకూడదన్నారు. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం అన్నారు. మహిళలు, యువతులు, చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తించి వారిని గౌరవించాలన్నారు. మహిళ పట్ల, చిన్న పిల్లలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. యువకులు గుంపులుగా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సమాచారం ఇచ్చే అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని చెప్పారు. భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. మీ కాలనీ లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే డయల్ 100 కు గాని సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, రాందాస్ తేజావత్, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వర్ రావు, వనపర్తి సిఐ, ఎం, కృష్ణ, కొత్తకోట సిఐ, రాంబాబు, సాయుధ దళ రిజర్వ్ ఇన్స్పెక్టర్, అప్పలనాయుడు, వనపర్తి రూరల్ ఎస్సై, జలేందర్ రెడ్డి, అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్, మహిళ కానిస్టేబుళ్లు. హోంగార్డ్స్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్