36.2 C
Hyderabad
April 25, 2024 21: 51 PM
Slider ఖమ్మం

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

#khammampolice

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని డీసీపీ LC. నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో  గురువారం తెల్లవారుజామున  సత్తుపల్లి పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు గుర్తింపు కార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా డీసీపీ LC నాయక్ మాట్లాడుతూ నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్  ఆదేశాల మేరకు  స్థానిక ప్రజలకు ఎలాంటి అభద్రత భావం లేకుండా  మేమున్నామని భరోసా కల్పించడం కోసమే  ఇలాంటి ఆకస్మికంగా తనిఖీలు చేసి నేరస్తుల కదలికలను, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, అయా ప్రాంతాలలో  ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని తెలిపారు.

స్థానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణం వుండాలని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయములో అయిన డయల్ 100 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు  సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు  నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని  తెలిపారు.  పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను  కొనుగోలు చేయవద్దని సూచించారు.

ఈ రోజు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలకు సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్డెన్ అండ్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలిస్ వారికి పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు. కార్డన్ అండ్ సెర్చ్ లో సరియైన పత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలను, కారు, ఒక ఆటోను పోలీస్  స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వెంకటేశ్ సిఐ రామాకాంత్,  కరుణకర్,  పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

Related posts

బిచ్కుందలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

రగులుతున్న రాజకీయం: రాజంపేట వైసీపీలో అసమ్మతి కుంపటి

Satyam NEWS

ఎంపీ గురుమూర్తిని కలిసిన తీర ప్రాంత మత్స్యకారులు

Bhavani

Leave a Comment