36.2 C
Hyderabad
April 25, 2024 22: 38 PM
Slider మహబూబ్ నగర్

తెరుచుకున్న స్కూళ్లలో కరోనా మెడికల్ క్యాంప్

#CoronaTest

కరోన వల్ల గత మార్చి నెలలో,  మూత పడ్డ పాఠశాలలు- ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి  ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల అంగీకారంతో- 9,10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాల కు హాజరవుతున్నారు.

కరోన నిబంధనలు, పాటిస్తూ ఉపాద్యాయులు , విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం  డాక్టర్ల బృందం  అజ్జకొల్లు  హై స్కూలు విద్యార్థుల కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు-అందరూ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు నిర్ధారించారు.

అందరూ, పాటించవలసిన కనీస జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. అవసరమైనప్పుడు సమాచారం ఇస్తే చికిత్స అందిస్తామని చెప్పారు. బి. కృష్ణ ,ఇంచార్జి ప్రధానోపాధ్యాయుల  ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.

మెడికల్ క్యాంపు నిర్వహించిన వారిలో డాక్టర్ నిసార్ అహ్మద్,డాక్టర్ షoషున్నిసా, ఫార్మసీస్ట్ యాదయ్య, ఏఎన్ఎం చిలుకమ్మ ఉన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు , ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బి. కృష్ణ, వీరన్న,చంద్రశేఖర్, రాజు,రాజా రెడ్డి,శ్యాం ప్రసాద్,లక్ష్మీ, ఇందుప్రియ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

మదర్సాలో చదివిన వారికే గుర్తింపు.. తాలిబన్ల రూల్

Sub Editor

గుడ్ వర్క్: పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం పంపిణీ

Satyam NEWS

ఏలూరుకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Satyam NEWS

Leave a Comment