ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను తెలంగాణలో ఎంటర్ కాకుండా నిరోధించేందుకు అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. దీనికోసం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రులలో ఇప్పటికే ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష కిట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను పుణెకు పంపించాల్సి వచ్చేది. ఇక్కడికే కిట్లు రావడంతో రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీలుకలుగుతుంది.
previous post