రాష్ట్రంలో విశ్వకర్మలు (కార్పెంటర్లు) సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని, ఇందుకోసం అటవీ శాఖ అధికారులు, విశ్వకర్మల ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అటవీ, పర్యావరణం, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
విశ్వకర్మల సమస్యలు, ప్రతినిధి సంఘాల ప్రతినిధులతో అరణ్య భవన్ లో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చట్టపరిధిలో పరిష్కారిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విశ్వకర్మలను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందిపెట్టే ప్రసక్తే లేదని, అదే సమయంలో పర్యావరణపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా విశ్వకర్మలు సహకరించాలని మంత్రి సూచించారు.
సమావేశంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి కూడా పాల్గొన్నారు. అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించటంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, అలాగే కార్పెంటర్ల సమస్యలను కూడా సానుభూతితో పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, వివిధ జిల్లాలకు చెందిన జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.
2 comments
మీరు అందిస్తున్న సమాచారం బాగుంది, విశ్వకర్మలు ఎదురుకుంటున్న సమస్యల పై ప్రభుత్వంతో చర్చించి వారికీ అందవలసిన ఫలాలను అందించే దిశగా పనిచేయాలని నాయకులను, కుల సంఘ పెద్దలను కోరుతున్నాము.
thank you. Hope problems will be salved