33.2 C
Hyderabad
April 26, 2024 02: 04 AM
Slider శ్రీకాకుళం

మహిళా ఎస్సైని ఏడిపించిన ముగ్గురు విలేకరులపై కేసు

#Case

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ, అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని ఆపి కేసు బుక్ చేసిన ఒక మహిళా ఎస్ ఐ పై ముగ్గురు విలేకరులు దౌర్జన్యం చేశారు. అసభ్యపదజాలంతో దూషించడంతో ఆ మహిళా ఎస్సై తీవ్రమైన భావోద్వేగానికి గురై తన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు కూడా స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయడంతో దురుసుగా ప్రవర్తించిన ముగ్గురు విలేకరులపై కేసు నమోదు చేశారు.

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కొత్తవలస పోలీసు స్టేషన్ లోమహిళా SI గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు దేవి ఈ నెల ఆరో తేదీ సాయంత్రం చింతల దిమ్మ దగ్గరలో వాహనాలు తనిఖీ డ్యూటీలో ఉన్నారు. ఆమె, ఆమె సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా, అలమండ సంత నుండి కొత్తవలస వైపు వస్తున్న ఒక ఇచ్చర్ వాహనం (No AP 39 Y 3489) కనిపించింది. సదరు వాహనం నెంబర్ ప్లేట్ సరిగా కనిపించకుండా ఉన్నది.

సదరు వాహనం నెంబర్ ని డ్రైవర్ ని అడగగా తెలిసింది. అయితే సదరు వాహనం డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, యూనిఫామ్ వేసుకోకుండా, వాహనంలో పది పశువులను కుక్కి కట్టి వాటికి ఆహారం గాని, నీరుగాని పెట్టకుండా ఉంచాడు. ఆ పశువులకు ప్రాణ హాని కలిగే విధంగా, వాహనాన్ని స్పీడుగా డ్రైవ్ చేసుకుంటూ రాగా పోలీసులు ఆపారు. వాహనం స్పీడుగా, అజాగ్రత్తగా నడిపినందుకు గాను Sec 279 IPC క్రింద మరియు Prevention of cruelty to Animal sAct 1960 క్రింద, mv Act క్రింద చేసిన నేరాలకు గాను అక్కరెన్స్ రిపోర్టు తయారు చేసి సదరు వాహనంను, వాహనం డైవర్ను తీసుకొని వస్తుండగా ఇంతలో ఎవరో ఒకవ్యక్తి ఎసైకి ఫోన్ చేశాడు.

నువ్వు SI వేనా నీకు వాహనాలు ఆపడానికి అధికారమేమిటి అని దురుసుగా అసభ్యకరంగా మాట్లాడాడు. ఎదైనా ఉంటే పోలీసుస్టేషన్ కు వచ్చి మాట్లాడండి అని ఆమె ఫోన్ పెట్టేశారు. ఆమె స్టేషన్ బయటకు చేరుకొనేసరికి ఆ వ్యక్తి వచ్చి తన పేరు గోవిందా ప్రకాష్ అని తాను మహా న్యూస్ రిపోర్టర్ని అని పరిచయం చేసుకున్నాడు. నా ఫోన్ ఎందుకు కట్ చేశావు అంటూ మహిళా SI అని కూడా చూడకుండా మాస్టాఫ్ అందరు ఉండగానే పెద్ద గొంతు తో సదరు పట్టుకున్న వాహనం ని వదిలెయ్యమని నా విధులకు ఆటంకం తగ్గిస్తూ. నాతో అసభ్యకరమైన పదజాలం వాడి నా పైకి దురుసుగా వచ్చేశాడు.

అవ్యక్తికి తోడుగా m ధర్మ CVR News, వసంత కృష్ణ HMTV, m నాయుడు Tv 5 జర్నలిస్టులు అందరూ ముకుమ్మడిగా ఆమె పైకి వచ్చారు. తనను బెదిరిస్తూ తనపై దౌర్జన్యం చేసి స్టేషన్ లోపలికి కూడా వెళ్లనీయకుండా విధులకు టంకపరిచారని ఆమె తెలిపారు. అనుమతి లేకుండా వీడియోలు కూడా పోలీసు స్టేషన్ ఆవరణంలో తీశారని, ఈ లోపు CI రావడంతో వారు అక్కడ నుండి వెనుదిరిగి వెళ్లి పోయారని ఎస్ ఐ తెలిపారు.

Related posts

సమంత ‘యశోద’ చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్!

Bhavani

శ్రీ రామాంజనేయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు

Satyam NEWS

కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment