కన్న తల్లిపై మాజీ సీఎం జగన్ రెడ్డి వేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సొంత చెల్లెలికి ఆస్తి పంపకం విషయంలో తలెత్తిన వివాదంలో కన్నతల్లి అయిన వై ఎస్ విజయలక్ష్మిపై జగన్ రెడ్డి కేసు వేసిన విషయం తెలిసిందే. తల్లిపై కేసు వేయడంతో జగన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన విషయం కూడా తెలిసిందే. సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినా కూడా ఏ మాత్రం చలించకుండా ఆయన కేసును కొనసాగించాడు. ఈ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది.
సరస్వతి పవర్ షేర్ల బదిలీపై నేషనల్ కంపెనీ లాట్రిబ్యునల్ లో జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా జగన్ వేసిన పిటిషన్ పై నేషనల్ కంపెనీ లాట్రిబ్యునల్ లో నేడు విచారణ జరిగింది. విచారణ లో భాగంగా అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులుగా ఉన్న విజయమ్మ, షర్మిల ట్రిబ్యునల్ ను సమయం కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చేనెల 13 వ తేదీకి వాయిదా వేసింది. మరి కొంచెం సమయం దొరికినందున జగన్ రెడ్డి మనసు మార్చుకుని తల్లి, చెల్లిపై కేసు ఉపసంహరించుకుంటాడా లేదా అనేది తేలాల్సి ఉంది.